Selfie with Train: హైదరాబాద్‌లో 5 ఏళ్ల క్రితం నాటి ఘటనకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్.. అసలు ఈ కుర్రాడికి ఏమైందంటే..!
ABN , First Publish Date - 2023-05-03T20:01:27+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఏ చిన్న సంఘటన జరిగినా.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూస్తే.. ఇది నిజమా, లేక గ్రాఫిక్సా.. అని అనుమానం కలుగుతుంటుంది. చాలా ఫేక్ వీడియోలు కూడా..
సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఏ చిన్న సంఘటన జరిగినా.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూస్తే.. ఇది నిజమా, లేక గ్రాఫిక్సా.. అని అనుమానం కలుగుతుంటుంది. చాలా ఫేక్ వీడియోలు కూడా వైరల్ అవుతుండడంతో ఇలాంటి అనుమానాలు కలుగుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. హైదరాబాద్‌లో (Hyderabad) ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోపై కూడా గతంలో ఇలాంటి చర్చే జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం మళ్లీ తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రమాదానికి గురైన కుర్రాడికి అసలు ఏమైందంటే..
సోషల్ మీడియాలో రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. తెలంగాణ వరంగల్ (Warangal) ప్రాంతానికి చెందిన శివ అనే జిమ్ ట్రైనర్ 2018 జనవరిలో రైలు ప్రమాదానికి గురయ్యాడు. ఎంఎంటీఎస్ ట్రైన్ (MMTS Train) వస్తుండగా పట్టాల వద్ద నిలబడ్డ శివ.. సెల్ఫీ వీడియో ఆన్ చేసుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న రైల్వే గార్డు, మరికొందరు అతన్ని దూరంగా వెళ్లమంటూ హెచ్చరించారు. అయినా సదరు యువకుడు పట్టాల పక్కనే నిలబడి వీడియో (Video) తీసుకున్నాడు. అప్పటికే వేగంగా వస్తున్న రైలు శివను ఢీకొని వెళ్లిపోతుంది. ఈ ప్రమాదంలో అతను దూరంగా ఎగిరిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
రైలు అతడి చేతిని మాత్రమే తాకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతడిపై అప్పట్లో కేసు నమోదు చేసి రైల్వే మేజిస్ట్రేట్‌కు పంపగా, నిబంధనలు అతిక్రమించినందుకు రూ.500 జరిమానా (fine) కూడా విధించారు. అయితే ఈ వీడియో అప్పట్లో వైరల్ అవడంతో అంతా ఇది ఫేక్ వీడియో అని ప్రచారం చేశారు. శివ తన స్నేహితులు కలిసి నకిలీ వీడియోను (Fake video) సృష్టించారని, అనంతరం సదరు వ్యక్తి పరారీలో అయ్యాడని కూడా అంతా అనుకున్నారు. అయితే వీడియో వైరల్ అవడంతో శివ తన ఫోన్ స్విచ్చాప్ చేసుకున్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో రైలుకు, అతడికి చాలా దూరం ఉందని, అయితే రైలు అతడి చేతిని తాకడం వల్ల మొబైల్ కిందపడిపోతుంది. మొబైల్ షేక్ అవ్వడం పెల్ల పెద్ద ప్రమాదం జరిగినట్లు కనిపించిందని, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడని రైల్వే అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతుండడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.