Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా.. ఈ వరుడి వాయిస్ విని షాక్.. పాట పాడుతోంటే వాళ్ల రెస్పాన్స్‌ను మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-10-03T18:07:04+05:30 IST

పెళ్లిళ్లు జరిగే తీరులో ఒకప్పటికి, ప్రస్తుతానికి చాలా మార్పులొచ్చాయి. దీనికితోడు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పెళ్లికి వచ్చిన బంధువులతో పాటూ వధూవరులు కూడా చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరిలో దృష్టిలో పడుతున్నారు. ఈ క్రమంలో...

Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా.. ఈ వరుడి వాయిస్ విని షాక్.. పాట పాడుతోంటే వాళ్ల రెస్పాన్స్‌ను మీరే చూడండి..!

పెళ్లిళ్లు జరిగే తీరులో ఒకప్పటికి, ప్రస్తుతానికి చాలా మార్పులొచ్చాయి. దీనికితోడు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పెళ్లికి వచ్చిన బంధువులతో పాటూ వధూవరులు కూడా చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరిలో దృష్టిలో పడుతున్నారు. ఈ క్రమంలో కాస్త వినూత్నంగా ఏ ఘటన జరిగినా ఇట్టే నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో పాట పాడుతున్న వరుడి వాయిస్ విని అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడు తన బంధవులతో కలిసి వధువు గ్రామానికి ఊరేగింపుగా (procession) వచ్చాడు. మరోవైపు బ్యాండు మేళాల మధ్య అంతా చిందులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా వరుడిని పాట పాడాలని బలవంతం చేస్తారు. దీంతో చివరకు తప్పక వరుడు మైక్ అందుకోవాల్సి వస్తుంది. పక్కనున్న వారంతా అతడు ఏపాట పాడతాడు, ఎలా పాడతాడు... అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారితో పాటూ పక్కనే ఉన్న ఓ పెద్దాయన కూడా వరుడి పాట కోసం వేచి చూస్తూ ఉంటాడు.

Viral Video: వ్యోమగాముల కష్టాలు మరీ ఈ రేంజ్‌లో ఉంటాయా..? అంతరిక్షంలో ఉండగా వేడి వేడి కాఫీ తాగాలంటే..!

మైక్ అందుకున్న వరుడు.. నోరు తెరగానే అమ్మాయిలా (groom sang song with woman voice) వినిపించడం చూసి ఒక్కసారిగా అంతా పక్కున నవ్వకుంటారు. అతడు పాడడం కూడా అచ్చం అమ్మాయిలాగే పాడుతూ అందరినీ ఉర్రూతలూగిస్తాడు. వరుడి పక్కన పెద్దాయన ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు. అలాగే మరోవ్యక్తి వరుడిపై కరెన్సీ నోటు విసిరివేస్తూ ఎంకరేజ్ చేస్తాడు. మరికొంత మంది ఈలలు, కేకలు వేస్తూ డాన్సులు కూడా వేస్తారు. మొత్తానికి ఈ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతడు పాడడం వధువు చూస్తే పారిపోతుందేమో’’.. అని కొందరు, ‘‘ఆర్కెస్ట్రాకు గాయని అవసరం ఉండదు’’.. అని మరికొందరు, ‘‘చాలా బాగా పాడాడు’’.. అని ఇకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: లిఫ్ట్‌లో ఒంటరిగా ఉందని చొరవ తీసుకున్న యువకుడు.. మొదటిసారి క్షమించిన యువతి.. చివరికి రెండోసారి..

Updated Date - 2023-10-03T18:07:04+05:30 IST