Viral Video: రియల్ లైఫ్ రాజేంద్రుడు గజేంద్రుడు.. యజమాని దూరంగా వెళ్లిపోతుంటే.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-10-01T20:30:29+05:30 IST

ఏనుగుకు, సంరక్షకుడికి మధ్య ఉండే అనుబంధాన్ని రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే నిజ జీవితంలో అలాంటి సన్నివేశాలు చూడడం అసాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఘటనలు సినిమా సీన్లను మించి ఉంటాయి. ఇలాంటి..

Viral Video: రియల్ లైఫ్ రాజేంద్రుడు గజేంద్రుడు.. యజమాని దూరంగా వెళ్లిపోతుంటే.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..

ఏనుగుకు, యజమానికి మధ్య ఉండే అనుబంధాన్ని రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే నిజ జీవితంలో అలాంటి సన్నివేశాలు చూడడం అసాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఘటనలు సినిమా సీన్లను మించి ఉంటాయి. ఇలాంటి అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యజమాని తనకు దూరంగా వెళ్లిపోతుండడం చూసి ఓ ఏనుగు చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏనుగు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మావటి తన ఏనుగుకు (elephant) తన మీద ఎంత ప్రేమ ఉందో పరీక్షించాలని అనుకున్నాడు. ఏనుగును రోడ్డుపై వదిలిపెట్టి తన స్నేహితుడి బైకు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. తన యజమాని వెళ్లిపోవడాన్ని చూసిన ఏనుగు పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లింది. బైకు ఎక్కుతున్న అతన్ని తొండంతో గట్టిగా పట్టుకుని పక్కకు లాగేసింది. ‘‘నన్ను వదిలి వెళ్లిపోతావా.. నువ్వు వెళ్లినా.. నేను నిన్ను వెళ్లనివ్వను’’.. అన్నట్లుగా అతన్ని పట్టుకుని దూరంగా తీసుకెళ్తుంది. ఈ క్రమంలో అతడిపై తనకున్న ప్రేమ (bond between elephant and caregiver) మొత్తం చూపిస్తుంది. విడిచిపెడితే ఎక్కడ వెళ్లిపోతాడో అనే భయంతో అతన్ని తొండంతో చుట్టేసి ఎటూ కదలకుండా చేస్తుంది.

Viral Video: ప్రమాదవశాత్తు రైలు కింద పడిన యువకుడు.. కాపాడేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. చివరికి ఏం జరిగిందంటే..

అయితే మధ్యలో అతను విడిపించుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి బైకు ఎక్కబోతాడు. దీంతో ఏనుగు కూడా వేగంగా పరుగెత్తి అతన్ని పట్టుకుని మళ్లీ కిందకు లాగుతుంది. ‘‘ఇలాగైతే కాదు.. బైకు నడిపేవాన్నే బెదిరిస్తే పోలా’’.. అని అనుకుందే ఏమో గానీ .. చివరకు బైకు నడుపుతున్న వ్యక్తిని అక్కడి కిందకు లాగి పక్కకు తీసుకెళ్తుంది. ఇలా తన యజమానిపై తనకున్న ప్రేమను బయటపెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల్లో లేని అభిమానం.. జంతువుల్లో కనిపిస్తోంది’’.. అని కొందరు, ‘‘విశ్వాసం అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘ఈ ఏనుగు చూస్తుంటే.. ఎంతో ముచ్చటేస్తోంది’’.. అని ఇకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 46వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

Updated Date - 2023-10-01T20:30:29+05:30 IST