Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

ABN , First Publish Date - 2023-04-29T15:00:45+05:30 IST

బల్లి... ఈ పేరు వింటేనే ఒళ్లంతా కంపనం పుడుతుంది. గోడ మీద కనపడితే.. చాలా మందికి దాన్ని బయటికి తరిమికొట్టే వరకూ ప్రశాంతత ఉండదు. ఇక పొరపాటున మీద పడితే ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో..

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

బల్లి... ఈ పేరు వింటేనే ఒళ్లంతా కంపనం పుడుతుంది. గోడ మీద కనపడితే.. చాలా మందికి దాన్ని బయటికి తరిమికొట్టే వరకూ ప్రశాంతత ఉండదు. ఇక పొరపాటున మీద పడితే ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు వెంటనే జ్యోతిష్యులను సంప్రదించి ఏవేవో పూజలు కూడా చేయిస్తుంటారు. ఇలాంటి బల్లి.. పొరపాటున మనిషిని కరిస్తే ఏమవుతుంది?. ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని చాలా మంది భావిస్తారు. ఈ సందేహానికి సమాధానం ఇస్తూ ఓ యువకుడు చేసిన ప్రయోగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంతా చూస్తుండగా.. ఓ కుర్రాడు చెవిని బల్లి కొరికేసింది. చివరకు ఏమైందంటే..

జార్ఖండ్‌లోని (Jharkhand) బొకారో జిల్లాకు చెందిన సందీప్ జోషి అనే యువకుడు జంతు ప్రేమికుడు. ప్రధానంగా ఇతను జనారణ్యంలోకి వచ్చే పాములను (snakes) పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో అతను పాములతో పలు ప్రయోగాలు చేస్తుంటాడు. వాటిని కాళ్లు, చేతులకు కరిపించుకోవడం ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తుంటాడు. అలా మొఖం, చేతులపై తేళ్లను పెట్టుకుని కూడా వీడియోలు చేస్తుంటాడు. ఇతను ఇటీవల తన చెవికి బల్లిని కరిపించుకున్నాడు. ఓ బల్లిని తీసుకుని తన చెవికి కరిపించుకున్నాడు. చెవి పోగులాగా వేలాడుతున్న బల్లి (lizard) .. చాలా సేపు అతడి చెవిని కొరుకుతూనే ఉంది.

సహోద్యోగితో యువతి స్నేహం.. నాలుగేళ్ల తర్వాత ఉన్నట్టుండి అదృశ్యమైన యువకుడు.. చివరకు ఆస్పత్రిలో వైద్యుని సంప్రదించగా..

కొద్ది సేపటి తర్వాత దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ‘‘బల్లి కరిస్తే చాలా మంది భయపడిపోతారు.. నిజానికి ఏ బల్లి కరిచినా ఏమీ కాదు’’.. అంటూ వివరించాడు. అయితే ఆహారంలో బల్లి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. తర్వాత దాన్ని ఓ ఇంటికి పైకి విసిరేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది. దీనిపై నిటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎంత ఖర్చు చేసినా ఇలాంటి చెవి పోగులు దొరకవు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహాసాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి బ్రదర్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

Updated Date - 2023-04-29T15:00:45+05:30 IST