Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..
ABN , First Publish Date - 2023-04-27T20:11:14+05:30 IST
యువతులు ఫొటోలు చూడగానే ముందూ వెనుకా చూడకుండా పలువురు స్నేహం చేసేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో యువతీయువకుల ఆన్‌లైన్ స్నేహాలు పెరిగిపోయాయి. ఇలాంటి స్నేహాల వల్ల మంచి ఎంత జరుగుతోందో..
యువతులు ఫొటోలు చూడగానే ముందూ వెనుకా చూడకుండా పలువురు స్నేహం చేసేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో యువతీయువకుల ఆన్‌లైన్ స్నేహాలు పెరిగిపోయాయి. ఇలాంటి స్నేహాల వల్ల మంచి ఎంత జరుగుతోందో.. చెడు కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ప్రధానంగా మహిళల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి తన పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించింది. గదిలో ఇద్దరూ ఏకాంతంగా సడన్‌గా మరో వ్యక్తి లోపలికి రావడంతో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ (Uttarakhand) ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉపాధ్యాయుడిగా (teacher) పని చేస్తుంటాడు. ఇతడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. ఇటీవల ఉపాధ్యాయుడికి ఫేస్‌బుక్ (Facebook) ద్వారా ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ (young woman friend request) వచ్చింది. ఆమె చాలా అందంగా ఉండడంతో వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఓ రోజు ఆమె నుంచి మెసేజ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ రోజూ చాటింగ్ (Chatting) చేసుకునే వారు. ఈ పరిచయం కొన్నాళ్లకు ఫోన్ నంబర్లు మార్చుకునే వరకూ వెళ్లింది. ఆ తర్వాత నుంచి రోజూ ఫోన్లు కూడా చేసుకునేవారు.
Viral Vdeo: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
ఇలా వీరి మధ్య కొన్నాళ్లకే సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21 యువతి పుట్టిన రోజు (birthday) ఉండడంతో.. వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించింది. అప్పటికే ఆమెపై ప్రేమ పెంచుకున్న పిలిచిందే తడవుగా.. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక చూస్తే.. లోపల ఎవరూ లేరు. ‘‘నీతో ఏకాంతంగా మాట్లాడాలి’’.. అంటూ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లింది. అక్కడ అతడిపై ప్రేమ నటిస్తూ దుస్తులు తీసేసింది. ఇలా వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మరో వ్యక్తి లోపలికి వచ్చాడు. అప్పటికే ఈ ఘటనను మొత్తం వీడియో తీసిన అతను.. సదరు వీడియో చూపించి బెదిరించాడు.
Viral Vdeo: ఇదేం పిచ్చిరా నాయనా.. మనిషిని ఎత్తుకుని డాన్స్ చేయడం చూశాం గానీ.. మరీ ఇలా ఏకంగా..
వెంటనే రూ.2లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన టీచర్.. తన వద్ద అంత మొత్తం లేదని చెప్పడంతో అంతా కలిసి దాడి (attack) చేశారు. చివరకు విధి లేని పరిస్థితుల్లో తెలిసిన వారికి ఫోన్ చేసి రూ.30లు, తన అకౌంట్ నుంచి రూ.10వేలు బదిలీ చేశాడు. చివరకు ఉపాధ్యాయుడి వద్ద నుంచి బైకు, క్రెడిట్ కార్డు, మొబైల్ తీసుకుని వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యాభర్తలతో సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.