Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-10T15:00:16+05:30 IST

వివాహ సమయాల్లో కొన్నిసార్లు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవి కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మంటపంలో అందరి ముందూ కొన్నిసార్లు వరుడు విచిత్రంగా ప్రవర్తిస్తే.. మరికొన్నిసార్లు ..

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

వివాహ సమయాల్లో కొన్నిసార్లు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇవి కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మంటపంలో అందరి ముందూ కొన్నిసార్లు వరుడు విచిత్రంగా ప్రవర్తిస్తే.. మరికొన్నిసార్లు పెళ్లి పీటలపైనే డాన్సులు చేస్తుంటాడు. అలాగే చాలా మంది వధువులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ.. అతిథులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట.. తెగ చక్కర్లు కొడుతోంది. వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా దండ తెగిపోతుంది. దీంతో కంగారుపడిన వరుడు.. దండను సరి చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి చేసిన పని చూసి.. అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వివాహ వేదికపై (wedding venue) వధూవరులు (bride and groom) .. దండలు మార్చుకుంటుంటారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేస్తుంది. అనంతరం వరుడి కూడా దండ వేసేందుకు సిద్ధమవుతాడు. అయితే తీరా మెడలో వేస్తుండగా దండ తెగిపోతుంది. దీంతో ఒక్కసారిగా అతను కంగారుపడతాడు. పక్కన వీడియోలు, ఫోటోలు (Videos and photos) తీస్తుండడంతో వెంటనే సరి చేసేందుకు ప్రయత్నిస్తాడు.

Love couple: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమజంట.. హోటల్ గదిలో ఉండగా కుటుంబ సభ్యుల నుంచి ఫోన్.. యువతి చెప్పింది విని.. అక్కడికి వెళ్లి చూడగా..

కంగారు కంగారుగా తెగిన దారాన్ని ముడి వేస్తుంటాడు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. కోటు జేబులో నుంచి కరెన్సీ నోట్లను బయటికి తీసి, వధూవరులపై చల్లుతాడు. వరుడు మొత్తానికి దండను సరి చేసి, వధువు మెడలో వేస్తాడు. పక్కనున్న వ్యక్తి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా నోట్లను (Currency notes) చల్లుతూనే ఉంటాడు. పక్కనే ఉన్న కొందరు.. నోట్లను ఏరుకుంటూ ఉంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral News: పెళ్లిలో ఫొటోలు దిగుతుండగా.. ఉన్నట్టుండి అనుకోని అతిథి రావడం చూసి .. వధువుతో కలిసి పారిపోయిన వరుడు.. చివరకు..

Updated Date - 2023-05-10T15:00:16+05:30 IST