Viral News: పెళ్లిలో ఫొటోలు దిగుతుండగా.. ఉన్నట్టుండి అనుకోని అతిథి రావడం చూసి .. వధువుతో కలిసి పారిపోయిన వరుడు.. చివరకు..
ABN , First Publish Date - 2023-05-07T17:30:09+05:30 IST
వినోదం, విషాదం.. సంఘటన ఏదైనా, ఏ మారుమూలు ప్రాంతమైనా సరే.. క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కళ్ల ముందు ఏ వింత కనపడ్డా.. ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. వీటిలో..
వినోదం, విషాదం.. సంఘటన ఏదైనా, ఏ మారుమూలు ప్రాంతమైనా సరే.. క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కళ్ల ముందు ఏ వింత కనపడ్డా.. ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. వీటిలో కొన్ని ఇలా షేర్ చేయగానే అలా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిలో అతిథులంతా వధూవరులతో ఫొటోలు దిగుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి అనుకోని అతిథి లోపలికి రావడం చూసి.. వధువును తీసుకుని వరుడు పరారవుతాడు..
ఇండోనేషియా (Indonesia) తూర్పు జావా పరిధి సంపాంగ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కళ్యాణ మంటపంలో (wedding hall) ఓ వధూవరులు అందంగా ముస్తాబై అతిథులతో ఫొటోలు దిగుతుంటారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా వధూవరులకు గిఫ్ట్‌లు అందిచి, శుభాకాంక్షలు తెలుపుతూ చివరగా ఫోటోలు దిగుతూ ఉంటారు. మరికొందరు స్టేజి కింద నుంచి ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. లోపలికి ఎలా వచ్చిందో ఏమో గానీ.. ఓ ఆవు వేగంగా చొరబడుతుంది. ఆవు రావడాన్ని గమనించిన వారు ముందే అలెర్ట్ అయి.. అక్కడి నుంచి ఒక్కొక్కరుగా పక్కకు పారిపోతారు.
ఆవు దగ్గరికి వస్తుందనగా వరుడు గమనించి.. వధువును తీసుకుని అక్కడి నుంచి పరుగులు పెడతాడు. అప్పటికే ఆవు (cow ran into the wedding hall) వేదిక పైకి దూసుకొస్తుంది. అయితే అంతా ముందే అప్రమత్తమవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. స్టేజి పైన ఉన్న అలకరణ వస్తువులను ధ్వంసం చేసిన ఆవు.. తర్వాత అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos videos) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లికి పిలవలేదని ఆవుకు కోపం వచ్చినట్లుంది’’.. అని కొందరు, ‘‘ఫొటోలు తీసుకోవడానికి వచ్చిందేమో’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.