Viral Video: వామ్మో! ఇదే స్టంట్‌రా నాయనా.. కూల్‌డ్రింక్‌తో కోట్ల రూపాయల కారును ధ్వంసం చేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , First Publish Date - 2023-03-05T18:34:12+05:30 IST

కొందరు చేసే స్టంట్స్ చూడటానికి భయాన్ని కలిగిస్తుంటాయి. మరికొందరి స్టంట్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. వీళ్లకేమైనా పిచ్చా.. అని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ..

Viral Video: వామ్మో! ఇదే స్టంట్‌రా నాయనా.. కూల్‌డ్రింక్‌తో కోట్ల రూపాయల కారును ధ్వంసం చేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

కొందరు చేసే స్టంట్స్ చూడటానికి భయాన్ని కలిగిస్తుంటాయి. మరికొందరి స్టంట్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. వీళ్లకేమైనా పిచ్చా.. అని అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart phone) ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫొటో తీసి, లేదా ఇంకేదో వీడియో చేసి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. వాటిలో కొన్ని తెగ వైరల్ (Viral videos) అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే కారును ఓ వ్యక్తి.. కూల్‌డ్రింక్స్‌తో ధ్వంసం చేశాడు. కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.

రష్యాకు చెందిన మిఖాయిల్ లిట్విన్ అనే వ్యక్తి.. ఓ య్యూటూబర్ (YouTuber). ఇతడి ఛానల్‌కి లక్షల్లో సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఇలా వుండగా ఇటీవల ఇతడు చేసిన స్టంట్ (Stunt) చూసి అంతా షాక్ అవుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే తెల్లటి లంబోర్ఘిని (Lamborghini car) కారును ఓ ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. పక్కనే ఓ పెద్ద క్రేన్‌ను ఏర్పాటు చేశాడు. ఏం చేస్తున్నాడబ్బా.. అని అనుకునే లోపు పరుగెత్తుకుంటూ పక్కకు వస్తాడు. అంతలో క్రేన్ నుంచి పెద్ద బ్యారెల్.. ఉన్నట్టుండి కారుపై ధమేల్‌మని పడుతుంది.

Viral Video: మెట్రో రైల్లో ఇవేం పనులు తల్లీ.. ప్రయాణీకులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే సడన్‌గా ఓ యువతి మధ్యలోకి వచ్చి..

బ్యారెల్ నుంచి ఎర్రటి రంగులో ఉన్న కూల్‌డ్రింక్ (Cooldrink) ఫోర్స్‌గా బయటకు విరజిమ్ముతుంది. దీంతో ఆ ప్రాంతమంతా ఎర్రటి రంగులోకి మారుతుంది. ఈ స్టంట్‌లో కారు పూర్తిగా ధ్వంసమవుతుంది. ఈ కారు ఇండియాలో ప్రారంభ ధరనే రూ.3.15 కోట్లు అట. అయితే ఇంత విలువైన కారును ఎందుకు ధ్వంసం చేశాడనే సందేహం మీరు రావచ్చు. ఓ కూల్‌డ్రింక్ కంపెనీ ప్రచార నిమిత్తం ఆ స్టంట్ చేశాడీ వ్యక్తి. మొత్తానికి వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. కారును ఇలా ధ్వంసం చేయడం ఏం బాగోలేదు.. అంటూ కొందరు, కూల్‌డ్రింక్‌ కంపెనీ వారు బాగానే ముట్టజెప్పినట్లు ఉన్నారు.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ప్రేమికుల వద్దకు వచ్చిన యువతి.. సడన్‌గా యువకుడికి ముద్దు పెట్టి వెళ్లింది.. చివర్లో ప్రేయసి ఎక్స్‌ప్రెషన్ చూస్తే..

Updated Date - 2023-03-05T18:34:12+05:30 IST