Viral News: మొదటిసారి విమానం ఎక్కిన ఓ వ్యక్తి టాయిలెట్‌లో చేసిన పనికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-05-17T15:30:49+05:30 IST
ఎక్కువగా రైళ్లలో ప్రయాణించే అతను తొలిసారి విమానంలో ప్రయాణిస్తూ..రైళ్లో తరుచుగా చేసే అలాంటి అలవాటునే..
ఇంటర్‌నెట్ డెస్క్: మొదటిసారి విమానం ఎక్కిన ఓ వ్యక్తి వింత ప్రవర్తన అటు ప్రయాణికుల్లో, ఇటు ఫ్లైట్ సిబ్బందిని ఆందోళనకు గురి చేసింది. సాధారణంగా ఎక్కువగా రైళ్లలో ప్రయాణించే అతను తొలిసారి విమానంలో ప్రయాణిస్తూ..రైళ్లో తరుచుగా చేసే అలాంటి అలవాటునే విమానంలో కూడా చేశాడు. దీంతో ఫ్లైట్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు ఆ నిందితుడు చెప్పిన సమాధానం వింటే నవ్వు ఆగదు.
బెంగుళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానంలో 56 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే, ఎయిర్‌లైన్స్ డ్యూటీ మేనేజర్ KIA పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు ఆరోపించారు.
రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన నిందితుడిని ప్రవీణ్‌కుమార్‌గా గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఫ్లైట్ ఎక్కిన అతడు టాయిలెట్‌లో పొగ తాగుతున్నట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది గుర్తించారు. కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు విచారించగా..అతను చెప్పిన సమాధానం విని అతని అమాయకత్వానికి నవ్వుకున్నారు. "నేను నిత్యం రైలులో ప్రయాణిస్తాను. పొగ తాగడం నాకు అలవాటు. రైలులో ప్రయాణిస్తూ టాయిలెట్ లోపల బీడీలు కాల్చేవాడిని. ఇక్కడ కూడా అలా చేయొచ్చని భావించాను. దీంతో టాయిలెట్‌కు వెళ్లి బీడీ తాగాను.’’ అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
అయితే చెకింగ్ సమయంలో బీడీలను గుర్తించకపోవడం చాలా తీవ్రమైన చెకింగ్ వైఫల్యం. ఈ సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని అధికారి తెలిపాడు.