Viral: తల్లి -కూతురి మధ్య ఫన్నీ ఇంటరాక్షన్.. అమ్మ ఆదేశిండంతో బియ్యం బస్తాను ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2023-11-04T11:49:27+05:30 IST
సోషల్ మీడియాలోని పలు వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్శిస్తుంటాయి. దీంతో నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఆ వీడియోలు నెటిజన్లకు కూడా తెగ నచ్చేస్తుంటాయి.
సోషల్ మీడియాలోని పలు వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్శిస్తుంటాయి. దీంతో నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఆ వీడియోలు నెటిజన్లకు కూడా తెగ నచ్చేస్తుంటాయి. ఈ క్రమంలోనే లైక్‌లు కొట్టి, షేర్లు చేసి వీడియోలను మరింత వైరల్ చేస్తుంటారు. ఆ వీడియోలపై తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటారు. దీంతో కొంతకాలం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. అలాంటిదే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ తల్లి-కూతురి మధ్య నెలకొన్న ఫన్నీ ఘటనకు సంబంధించినది ఆ వీడియో. ఆ వీడియోలో ఓ అమ్మాయి బియ్యం బస్తాను అతి కష్టం మీద మోసుకెళ్లడం కనిపిస్తోంది. ఈ వీడియోను ఖుష్బూ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘నా తల్లి అత్యంత ఆరోగ్యరమైన ఎపిక్ రోస్ట్ వీడియోను రికార్డు చేసింది.’’ అని ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో కనిపిస్తోంది.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఓ తల్లి తన కూతురిని పిలుస్తుంది. దీంతో ఆమె గది నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చాక తలుపుల వద్ద ఉన్న బియ్యం బస్తాను తీసి వేరే దగ్గర పెట్టమని కూతురికి చెబుతుంది. దీంతో ఆమె కాస్త సంకోచిస్తుంది. కానీ ఆ తర్వాత బ్యాగును మోసుకెళ్లి ఒక దగ్గర పెడుతుంది. కాస్త కష్టంగా మోసుకెళ్తున్నట్టు వీడియోలో అర్థమవుతోంది. ఈ ఘటనను అంతా ఆమె తల్లి ఫోన్లో రికార్డు చేసింది. అయితే ఆ కూతురు ప్రతిరోజూ జిమ్ముకు వెళ్లడం వలన అది ఆమెకు సమస్య కాలేదు. ఐదు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 46 వేలకు పైగా లైకులు, టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చాయి. వేల సంఖ్యలో షేర్లు వచ్చాయి. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియలో ఇటీవల చూసిన ఉత్తమ రోస్ట్ వీడియో ఇదే అని కొందరు అంటే మరికొందరేమో ఆంటీ హృదయాలను గెలుచుకుందని రాసుకొస్తున్నారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.