Weight Loss: బరువు తగ్గడం యమా ఈజీనండీ బాబూ.. బెల్లంతో ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూశారా..?
ABN , First Publish Date - 2023-08-07T14:13:46+05:30 IST
బెల్లం భారతీయ సాంప్రదాయ వంటల్లో ఉపయోగించే తీపి పదార్థం. ఇది తీపినే కాదు, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఆయుర్వేదం బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే బెల్లాన్ని ఇలా వాడితే అధికబరువు ఐస్ లా కరిగిపోవడం ఖాయం..
బెల్లం భారతీయ సాంప్రదాయ వంటల్లో ఉపయోగించే తీపి పదార్థం. చక్కెర పరిచయం కాకముందు బెల్లమే భారతీయుల తీపి పదార్థాల తయారీలో ఉపయోగింపబడింది. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యప్రయోజనాలనూ చేకూరుస్తుంది. ఆయుర్వేదం కూడా బెల్లానికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఈ బెల్లంతో బరువు తగ్గడం చాలా సులువని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ బెల్లాన్ని ఉపయోగిస్తే అధికబరువు కాస్తా ఐస్ లా కరిగిపోవడం ఖాయం. ఇంతకూ బెల్లాన్ని ఎలా ఉపయోగించాలి? దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకంటే..
ప్రతిరోజూ కాఫీలు, టీలు చేసుకుని తాగడం సహజమే. అయితే ఈ కాఫీ, టీలోకి అందరూ చక్కెర(sugar) ఖచ్చితంగా వాడతారు. అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం(jaggery replace of sugar) వాడితే మ్యాజిక్ జరుగుతుంది. బెల్లం టీ(jaggery tea) తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం వస్తుందేమోనని భయపడేవారికి ఇది అమృతంలాంటిది. పైగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం టీ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు గణనీయంగా పెరుగుతుంది. 100గ్రాముల బెల్లంలో 383కేలరీలు ఉంటాయి. ఇందులో 11మిల్లీగ్రాముల ఐరన్, 0.1మిల్లీగ్రాముల కొవ్వు, 85మిల్లీగ్రాముల కాల్షియం, 20మిల్లీ గ్రాముల భాస్వరం, ఇతర పోషకాలు ఉంటాయి. ఇందులోని ఐరన్, కాల్షియం కూడా శరీరానికి ఎంతో అవసరమైందే. ప్రతిరోజూ తీసుకునే కాఫీ, పాలు,టీ.. ఇలా ఏదైనా అందులో పంచదార స్థానంలో బెల్లం వాడితే బరువు తగ్గుదల చూసి ఆశ్చర్యపోతారు.
Health Tips: రుద్రాక్షలను అందరూ మెడలో ధరిస్తుంటారు.. కానీ ఇలా ఉపయోగిస్తే ఎన్ని లాభాలో..
బెల్లంను నీటిలో ఉడికించి ఆ సిరప్ తీసుకుంటూ ఉంటే రోగనిరోధకశక్తి దృఢంగా మారుతుంది. మధుమేహాం ఉన్నవారు, మధుమేహం వస్తుందేమోనని భయపడేవారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడాలి. ఇది సహజ స్వీటెనర్ గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో మ్యాజిక్ చేస్తుంది, హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది(increase hemoglobin). కాలేయంలో వేడిని తగ్గిస్తుంది. వేగంగా బరువు పెరుగుతున్నవారికి బెల్లం గొప్పగా సహాయపడుతుంది. ప్రతిరోజూ తీసుకునే ఆహారం జీర్ణమయ్యేటప్పుడు అందులో చక్కెరలు, శక్తి విడుదల అవుతుంది. శరీరానికి ఈ చక్కెరలే సరిపోతాయి. ప్రత్యేకంగా పంచదార తీసుకుంటే అవి శరీరంలో అదనపు చక్కెరలు పేరుకుపోవడానికి కారణమవుతాయి. బెల్లం తీసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదు. బెల్లం కేవలం బరువు తగ్గించడంలోనే కాదు. మహిళల్లో ఎదురయ్యే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమే సమస్యను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. హార్మోన్లను సమతుల్యం చేసి మహిళల్లో ఎదురయ్యే నెలసరి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని పెంచుతుంది.