Marriage: వధువు మెడలో దండ వేసి పారిపోయిన వరుడు.. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..
ABN , First Publish Date - 2023-06-25T18:10:52+05:30 IST
ఇటీవల వివాహాలకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి డాన్సులు, ప్రాంక్‌లు.. ఇలా ప్రతీదీ వీడియోల రూపంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...
ఇటీవల వివాహాలకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి డాన్సులు, ప్రాంక్‌లు.. ఇలా ప్రతీదీ వీడియోల రూపంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. వధువు మెడలో దండ వేసిన తర్వాత వరుడు ఉన్నట్టుండి పారిపోయాడు. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..
బీహార్ (Bihar) భాగల్‌పూర్ జిల్లా ఇస్మాయిల్‌పూర్ పరిధి చౌదరి బసా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతికి (young woman) , పూర్నియా జిల్లా రూపాలి ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. శనివారం పెళ్లి జరగాల్సి ఉండడంతో వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా జయమాల కార్యక్రమానికి (Jayamala function) ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతిథులందరి సమక్షంలో వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం బంధువులంతా భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న వరుడు (groom) .. ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు.
దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. వరుడు పారిపోవడంతో భయపడ్డ అతడి బంధువులు కూడా వెళ్లిపోయారు. దీంతో అవాక్కైన వధువు బంధువులు.. వారిలో కొందరిని పట్టుకున్నారు. చివరకు పంచాయతీ గ్రామపెద్దలు, పోలీసుల వరకూ వెళ్లింది. చెప్పాపెట్టకుండా వరుడు ఇలా ఎందుకు వెళ్లాడో ఎవరికీ అర్థం కాలేదు. కొడుకు చేసిన పనికి అతడి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. ఎలాగైనా తన కొడుకును పిలిపించి పెళ్లి జరిపిస్తామని తండ్రి హామీ ఇవ్వడంతో గొడవ సర్దుమణిగింది. తర్వాత ఎట్టకేలకు అర్ధరాత్రి వరుడిని తీసుకొచ్చారు. వధువు ఇష్టం లేకే పారిపోయినట్లు అందరి ముందు అంగీకరించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యథాతథంగా వారి వివాహం జరిగింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.