Viral Video: నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. చివరకు ఈ యువతిని ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-06-24T20:31:04+05:30 IST

కళ్లెదుట ఎన్ని దారుణాలు జరుగుతున్నా.. మనకెందుకులే అని పక్కకు వెళ్లిపోయేవారు కొందరైతే.. మరికొందరు చోద్యం చూడడమే కాకుండా వీడియోలు కూడా తీస్తూ ఉంటారు. పట్టపగలు యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఎదురుతిరిగితే దాడులు చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. ఇలాంటి ..

Viral Video: నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు.. చివరకు ఈ యువతిని ఏం చేశాడో చూడండి..

కళ్లెదుట ఎన్ని దారుణాలు జరుగుతున్నా.. మనకెందుకులే అని పక్కకు వెళ్లిపోయేవారు కొందరైతే.. మరికొందరు చోద్యం చూడడమే కాకుండా వీడియోలు కూడా తీస్తూ ఉంటారు. పట్టపగలు యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఎదురుతిరిగితే దాడులు చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. ఇలాంటి దారుణాలు గతంలో ఎన్నో చూశాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం యువతి పట్ల ఓ యువకుడి దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా రద్దీ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు బురఖా ధరించిన యువతిని వెంటబెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. మూసి ఉన్న ఓ దుకాణం వద్దకు రాగానే సడన్‌గా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన (young man Attack on young woman) అతను ఆమెపై దాడికి దిగుతాడు. కొట్టుకుంటూ దుకాణంలోకి లాక్కొచ్చి అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తిస్తాడు. ‘‘నన్ను వదలెయ్ ప్లీజ్’’.. అని యువతి వేడుకుంటున్నా.. వదలకుండా ఎవరికో ఫోన్ చేస్తాడు.

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

అప్పటికే ఓ ఆటో అక్కడికి వచ్చి ఆగుతుంది. తర్వాత ఆమెను బలవంతంగా ఆటో ఎక్కించి తీసుకెళ్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. తర్వాత ఆమెను ఏం చేశాడన్నది తెలియరాలేదు. కాగా, వీడియో వైరల్ అవడంతో రాయబరేలీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని కొందరు, ‘‘పట్టపగలు ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-24T20:31:04+05:30 IST