నా కోసం ఏమైనా చేస్తావా.. అని ప్రేమికుల రోజున భార్యను అడిగిన భర్త.. ప్రాణమైనా ఇస్తా.. అని ఆమె అనడంతో మరుక్షణమే..
ABN , First Publish Date - 2023-02-19T16:05:51+05:30 IST
భర్త అంటే ఆమెకు ఎంతో ప్రేమ. తనే సర్వస్వంగా బతుకుతోంది. అతన్ని విడిచి ఒక్కరోజు కూడా దూరంగా ఉండేది కాదు. ఇంత మంచి భార్య ఉంటే చాలని.. ఏ భర్త అయినా కోరుకుంటాడు. అయితే..
భర్త అంటే ఆమెకు ఎంతో ప్రేమ. తనే సర్వస్వంగా బతుకుతోంది. అతన్ని విడిచి ఒక్కరోజు కూడా దూరంగా ఉండేది కాదు. ఇంత మంచి భార్య ఉంటే చాలని.. ఏ భర్త అయినా కోరుకుంటాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. భర్తపై అమితమైన ప్రేమ ఉన్న భార్యను.. ప్రేమికుల రోజున ‘‘నా కోసం ఏమైనా చేస్తావా’’.. అని అడిగాడు. ప్రాణమైనా ఇస్తా అని భార్య చెప్పడంతో చివరకు ఆ భర్త ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలి జిల్లా పరిధి బిత్రీ చైన్‌పూర్‌లో మహ్మద్ ఫరూఖ్ అనే వ్యక్తి ఓ క్లినిక్ (Clinic) నడుపుతుంటాడు. పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో ఇతడికి వరుసయ్యే ఓ యువతి (young woman) తరచూ క్లినిక్‌కు వస్తుండేది. ఇద్దరూ బంధువులు కావడంతో ఎంతో చనువుగా ఉండేవారు. ఇలా కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. ఫరూఖ్‌ను భార్య నస్రీన్‌కు భర్త అంటే ఎంతో ప్రేమ. అతడిని విడిచి ఒక్కరోజు కూడా దూరంగా ఉండేది కాదు. అంత మంచి భార్య ఉన్నా కూడా ఫరూఖ్.. మరో యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే భార్య ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. ఎలాగైనా యువతిని పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం ఏమైనా చేయాలని రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న (Valentines Day) భార్యతో ప్రేమగా మాట్లాడుతూ.. ‘‘ నేనంటే నీకు ఎంత ఇష్టం.. నా కోసం ఏమైనా చేస్తావా’’.. అని అడిగాడు.
దీంతో ఆమె ‘‘ నీ కోసం ప్రాణమైనా ఇస్తా’’.. అని చెప్పింది. అలా చెప్పగానే వెంటనే... ‘‘అయితే ఇవ్వు’’.. అంటూ జేబులోంచి కత్తి తీసి, భార్య కడుపులో (Assault on wife) పొడిచాడు. పలుమార్లు దారుణంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన తలకు కూడా చిన్న గాయం చేసుకుని, ఇంట్లో సామాన్లు అన్నీ చిందరవందరగా పడేశాడు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, తమపై దాడి చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లారు’’.. అంటూ అందిరిముందూ రోధిస్తూ నటించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో మొత్తం పరిశీలించారు. అయితే భర్త చెబుతున్న మాటలకు, ఇంట్లో ఉన్న సీన్‌కు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరకు ఫరూఖ్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు.