Whatsapp video: సహోద్యోగి భార్యతో అసభ్యకరంగా ఉన్న వీడియోను షేర్ చేసిన కానిస్టేబుల్.. ఒకేసారి వంద మంది చూస్తుండగా..
ABN , First Publish Date - 2023-01-06T19:50:59+05:30 IST
అతనో కానిస్టేబుల్. బాధ్యతగల వృత్తిలో ఉన్నా.. అతడి ప్రవర్తన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అశ్లీల వీడియోలు చూడడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో సహోద్యోగితో అసభ్యకరంగా ఉన్న వీడియోను..
అతనో కానిస్టేబుల్. బాధ్యతగల వృత్తిలో ఉన్నా.. అతడి ప్రవర్తన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అశ్లీల వీడియోలు చూడడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో సహోద్యోగితో అసభ్యకరంగా ఉన్న వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. దీంతో ఒకేసారి వంద మంది వీడియోను చూస్తుండగా.. అనుకోకుండా సదరు మహిళ భర్త కంటపడింది. దీంతో చివరకు ఏం జరిగిందంటే..
భర్తతో మాట్లాడిన తర్వాత తండ్రికి టీ ఇచ్చిన కూతురు.. కాసేపటి తర్వాత ఆమె చేసిన పనికి.. అంతా షాక్..
మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. అభిజీత్ పరాబ్ అనే వ్యక్తి ముంబైలో (Mumbai) కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వృతి పట్ల అంకితభావం చూపిస్తూ, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఇతను.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. నిత్యం అశ్లీల వీడియోలు చూడడమే అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో అశ్లీల వీడియోలు ఎక్కువగా షేర్ చేయబడే వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అందులో ఇతడితో పాటూ సుమారు 126మంది సభ్యులు ఉన్నారు. రోజూ ఎవరో ఒకరు అందులో అశ్లీల వీడియోలను (Indecent videos) షేర్ చేస్తూ ఉంటారు. ఇదిలావుండగా, పరాబ్ ఇటీవల తన సహోద్యోగి భార్యతో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తున్నాడు.
గ్లాసు నీరు సమర్పించి దేవుడికి పూజలు.. కోరిక నెరవేరకపోవడంతో ఆగ్రహం.. చివరకు ఓ రోజు రాత్రి..
భర్త లేని సమయంలో తరచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఇటీవల ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెతో కలిసి వీడియో తీసుకున్నాడు. అసభ్యకరంగా ఉన్న సదరు వీడియోను ఇటీవల వాట్సప్ గ్రూప్‌లో (Whatsapp group) షేర్ చేశాడు. ఆ వీడియోను అంతా ఓకే సారి చూస్తుండగా.. సదరు మహిళ భర్త కంటపడింది. తన భార్య సహోద్యోగితో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన పరువు తీసిన పరాబ్‌పై ఫిర్యాదు చేయాలని భార్యకు సూచించాడు. అయితే ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇటీవల ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఈ విషయం చివరకు ఉన్నతాధికారుల వరకూ చేరడంతో నిందితుడిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.