Wife: సరిగ్గా నెలన్నర క్రితమే ఈ 24 ఏళ్ల యువతికి పెళ్లి.. సడన్‌గా అల్లుడి నుంచి ఫోన్.. కూతురి గురించి చెప్పిన విషయం విని..!
ABN , First Publish Date - 2023-04-24T15:31:22+05:30 IST
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. సుఖసంతోషాలతో జీవించాలని దీవిస్తారు. ఆ పేరెంట్స్ కూడా
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. సుఖసంతోషాలతో జీవించాలని దీవిస్తారు. ఆ పేరెంట్స్ కూడా కూతురిని బాగా చదివించారు. వయసు రాగానే మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేశారు. అత్తారింట్లో ఆనందంగా ఉండాలని భారీగా కట్నకానుకలు ఇచ్చి మరీ పెళ్లి చేశారు. వారాలే గడుస్తోంది. ఇంకా కాళ్ల పారాణి కూడా ఆరలేదు. మెట్టినింట్లో బిడ్డ క్షేమంగానే ఉందని భావిస్తున్న తరుణంలో గుండె పగిలే వార్త విని వారంతా షాక్ అయ్యారు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. వరకట్న భూతానికి మరో అబల బలైంది. పెళ్లైన నెలన్నరకే అదనపు కట్నం వేధిస్తూ నవ వధువును పొట్టనబెట్టుకున్నారు భర్త కుటుంబీకులు. ఈ విషాద ఘటన కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది.
గదగ్ జిల్లా గజేంద్రగడకు చెందిన షహనాజ్ బేగం(24)కి ధార్వాడ జిల్లా అనేరికి చెందిన షహబాజ్ ములగుంద (26)తో (husband) వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరునికి పెద్ద మొత్తంలో కట్న కానుకలు, ఇంటి సామగ్రిని అందజేశారు. ఇక మెట్టినింటికి చేరాక షహనాజ్‌ను మరింత డబ్బు, బంగారం తేవాలని భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
ఇంకో వైపు శనివారం రంజాన్ పండుగ కావడంతో కొత్త దంపతులిద్దర్నీ షహనాజ్ తల్లిదండ్రులు ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నారు. ఇంతలో చేదువార్త వినాల్సి వచ్చింది. అందరూ రంజాన్ సంబరాల్లో ఉండగా షహనాజ్ ఆత్మహత్య (Wife commits suicide) చేసుకుందని భర్త ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ధార్వాడ ఆస్పత్రి చేరుకుని కుమార్తె జీవచ్ఛవంగా పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. రంజాన్ పండుగకు వస్తుందని ఎదురుచూస్తే.. చివరికి భర్త చిత్ర హింసలకు బలైపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. షహనాజ్ శరీరంపై గాయాలు, నోటి మీద తీవ్ర గాయం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.