Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-05-20T09:05:27+05:30 IST
ఊబకాయం (Obesity) అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యగా మారింది.
Wonderful Trick: ఊబకాయం (Obesity) అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఊబకాయానికి కారణమైతున్నట్లుగా ఇటీవల ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది కూడా. ఇక కోవిడ్ మహమ్మారి, వ్యాక్సినేషన్ తర్వాత చాలా మంది ఆకస్మాత్తుగా బరువు పెరగడం గురించి ఆందోళన చెందడం మొదలైంది. ముఖ్యంగా మహిళలు తమ పొట్ట చుట్టు కొవ్వును దాచుకోవడం గురించి ఆందోళన చెందుతారు. ఇదిలా ఉంటే.. ట్విటర్‌లో ఊబకాయంతో ఉన్న ఓ మహిళ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె చూపించే స్థూలకాయాన్ని దాచే టెక్నిక్ అదుర్స్ అనే చెప్పాలి. అంత లావున్న మహిళ కాస్తా ఒకే ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా మారిపోతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
'హాస్నా జరూరీ హై' (@HasnaZarooriHai) అనే ట్విటర్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది. 'దీన్నే అంటారు.. మారుతి కారును బీఎండబ్ల్యూగా మార్చడం అని' అనే ట్యాగ్‌ను కూడా వీడియోకు జత చేశారు. అంతే.. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోను ఇప్పటివరకు ఏకంగా 5.52లక్షల మంది వీక్షించారు. 4వేల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక ఈ వైరల్ వీడియోలో ఓ స్థూలకాయ మహిళ మొదట తన పొట్ట చుట్టు పెరుకుపోయిన కొవ్వును చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె పొట్ట ఉబ్బినట్లు కనిపించేలా ఓ గౌను ధరిస్తుంది. అనంతరం నల్లటి సాగే లక్షణం ఉన్న ఓ షార్ట్‌ను వేసుకుంది. అది అద్భుతంగా ఆమె పొట్ట చుట్టు ఉన్న కొవ్వు బయట కనిపించకుండా చేసేసింది. దాంతో అప్పటివరకు పెద్ద పొట్టతో లావుగా కనిపించిన ఆమె.. ఈ ఒకే ఒక్క ట్రిక్‌తో పూర్తిగా స్లిమ్‌గా మారిపోవడం మనం వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.