Viral Video: సైకిల్‌పై బాలిక.. స్కూటీపై పోలీస్.. స్కూలు నుంచి వెళ్తోంటే వెంటపడుతున్నాడని.. సైలెంట్‌గా వచ్చి షాకిచ్చిన మహిళ..!
ABN , First Publish Date - 2023-05-04T11:33:39+05:30 IST
ఓ స్కూల్ విద్యార్థినిని (School Student) పోలీసోడు ఫాలో కావడం గమనించిన ఓ మహిళ అతనికి తగిన బుద్ది చెప్పింది.
Viral Video: ఓ స్కూల్ విద్యార్థినిని (School Student) పోలీసోడు ఫాలో కావడం గమనించిన ఓ మహిళ అతనికి తగిన బుద్ది చెప్పింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ మహిళను మంచి పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు. లక్నో పరిధిలోని కాంట్ (Cantt) ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీడియోలో స్కూల్ నుంచి సైకిల్‌పై వస్తున్న ఓ బాలికను షహదత్ అలీ (Shahadat Ali) అనే పోలీసోడు స్కూటీపై ఫాలో కావడం మనం చూడొచ్చు. ఇలా చాలా కాలంగా అతడు ఆ విద్యార్థినిని వెంబడిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన ఓ మహిళ అతడిని సైలెంట్‌గా ఫాలో అయింది. అతడు బాలికను వెంబడిస్తున్న దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించింది. అనంతరం దారి మధ్యలో షహదత్ అలీని ఆపి.. ఏం చేస్తున్నావంటూ నిలదీసింది.
ఆ విద్యార్థినితో నీకేం పనంటూ అడిగింది. దాంతో అతడు ఒక స్టోరీ చెప్పాడు. ఆ బాలిక చదవుతున్న స్కూల్‌లోనే (School) తన కూతురు కూడా చదువుతుందని కట్టుకథ చెప్పి తప్పించుకోబోయాడు. వెంటనే ఆ మహిళ.. అతడి కూతురు చదువుతున్న స్కూల్ పేరు చెప్పాలని అడిగింది. కానీ, షహదత్ అలీ ఆ స్కూల్ పేరు కరెక్ట్‌గా చెప్పలేకపోవడం వీడియో రికార్డైంది. అనంతరం ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. అది కాస్త వైరల్‌గా మారింది. చివరకు లక్నో పోలీసుల (Lucknow Police) దృష్టికి కూడా వెళ్లింది. దాంతో పోలీస్ ఉన్నతాధికారులు షహదత్ అలీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక పోలీసోడిని సైలెంట్‌గా ఫాలో అయి.. ఊహించని షాకిచ్చిన మహిళను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారికి ఇదే కరెక్ట్ అని అంటున్నారు.