Shocking: నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్య.. ఆమె పక్కింటి యువతి సడన్‌గా అదృశ్యం.. అసలు కథేంటంటే..!
ABN , First Publish Date - 2023-10-07T20:59:07+05:30 IST
కొన్నిసార్లు అనుమానమే పెనుభూతమై.. మనిషిని సర్వనాశనం చేస్తుంది. అలాగే ఇదే అనుమానం మరికొన్నిసార్లు ఎదుటివారి చావుకూ కారణమవుతుంటుంది. ఇలాంటి దారుణాలు ఎక్కువగా మహిళల విషయంలోనే జరుగుతుంటాయి. తాజాగా...
కొన్నిసార్లు అనుమానమే పెనుభూతమై.. మనిషిని సర్వనాశనం చేస్తుంది. అలాగే ఇదే అనుమానం మరికొన్నిసార్లు ఎదుటివారి చావుకూ కారణమవుతుంటుంది. ఇలాంటి దారుణాలు ఎక్కువగా మహిళల విషయంలోనే జరుగుతుంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి అదృశ్యమైన కొన్ని రోజుల్లోనే మరో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) కోట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గుమన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కమలేష్ కుమావత్ (35) అనే మహిళ.. చుట్టు పక్కల ఇళ్లలో స్వీపర్‌గా పని చేస్తుండేది. ఈమె ఇంటి పక్కనే వీరూ అనే యువకుడి కుటుంబం కూడా ఉంటోంది. ఇదిలావుండగా, ఇటీవల వీరూ సోదరి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో చుట్టు పక్కల వారు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండడంతో వీరూ అవమానంగా భావించాడు. అయితే ఇటీవల అతడికి వారి ఇంటికి సమీపంలో ఉన్న మహిళ కుమావత్‌పై అనుమానం కలిగింది. తన సోదరి ఇంటి నుంచి పారిపోవడం వెనుక కుమావత్ హస్తం ఉందని కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని (young man conspired to kill the woman) నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సదరు మహిళ పని మీద ఇంటి నుంచి బయలుదేరింది.
అదే సమయంలో వీరూ కూడా ఆమె వెనుకే వెళ్లి ఉన్నట్టుండి కత్తితో ఆమెపై దాడికి దిగాడు. విచాక్షణారహితంగా దాడి చేయడంతో కుమావత్ తీవ్రగాయాలపాలైంది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన జరిగిన సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. కాగా, కుమావత్ తప్పేమీ లేకున్నా నిందితుడు కావాలనే హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మార్చురీ వద్ద ఆందోళన చేశారు. కుమావత్ మృతదేహాన్ని తీసుకునేందుకూ నిరాకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలో వీరూను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.