Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ యువతి పెళ్లి నిన్న జరిగి ఉండేది.. కానీ సరిగ్గా వివాహానికి రెండ్రోజుల ముందు..!

ABN , First Publish Date - 2023-06-30T20:01:48+05:30 IST

కూతురుకు మంచి సంబంధం రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. బంధువులందరికీ వివాహ వార్త తెలియజేసి, పెళ్లి పనులు మొదలుపెట్టారు. యువతి కూడా తన వివాహం గురించి స్నేహితులకు తెలియజేసి, అందరినీ ఆహ్వానించింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే..

Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ యువతి పెళ్లి నిన్న జరిగి ఉండేది.. కానీ సరిగ్గా వివాహానికి రెండ్రోజుల ముందు..!

కూతురుకు మంచి సంబంధం రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. బంధువులందరికీ వివాహ వార్త తెలియజేసి, పెళ్లి పనులు మొదలుపెట్టారు. యువతి కూడా తన వివాహం గురించి స్నేహితులకు తెలియజేసి, అందరినీ ఆహ్వానించింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే జూన్ 29న ఆమె వివాహం జరిగి ఉండేది. అయితే సరిగ్గా వివాహానికి రెండు రోజుల ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఈ పెళ్లి రద్దు చేసుకోవాలంటూ వధువు కుటుంబ సభ్యులే వరుడికి చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని కనోటా పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి (young woman) .. ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. జూన్ 29న మూహూర్థం ఫిక్స్ చేశారు. దీంతో ఇరువైపు కుటుంబాలు పెళ్లి పనుల్లో పడ్డారు. తన వివాహం గురించి యువతి తన స్నేహితులందరికీ చెప్పింది. ఈ క్రమంలో తన గ్రామానికి పింటూ అనే యువకుడికీ చెప్పింది. అయితే ఇదే తన పాలిట సమస్యగా పరిణమిస్తుందని ఆమె ఊహించలేదు. చిన్నప్పటి నుంచి అతన్ని స్నేహితుడిగా అనుకోవడంతో పెళ్లి విషయాన్ని తెలియజేసింది. అయితే అతను ఎప్పటి నుంచో మనసులో ప్రేమ పెంచుకోవడంతో.. యువతికి వివాహం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా యువతిని పాడు చేయాలని నిర్ణయించుకున్నాడు.

Marriage: అంబులెన్స్‌లో మండపానికి వచ్చి.. స్ట్రెచర్‌పై కూర్చునే వధువుకు తాళి కట్టిన వరుడు.. ఇలాంటి పెళ్లిని ఇప్పటిదాకా చూసుండరు..!

వివాహానికి రెండు రోజుల ముందు యువతికి పోన్ చేసి.. ‘‘నీతో మాట్లాడాలి.. అర్జంట్‌గా వచ్చేయ్’’.. అని పిలిచాడు. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లిన యువతిని ఓ గదిలో బంధించాడు. తాను అత్యాచారం చేసిన తర్వాత తన ముగ్గురు స్నేహితులకు అప్పగించాడు. వారు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, యువతికి కాబోయే భర్త ఫోన్‌కు పంపించారు. రెండు రోజుల పాటు యువతిని తమ వద్దే ఉంచుకుని, తర్వాత ఇంటికి పంపించారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వరుడి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి, వివాహం రద్దు చేసుకోవాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

Updated Date - 2023-06-30T20:01:48+05:30 IST