Dog vs Leopard: అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి చిరుతపులి ఎంట్రీ.. పెంపుడు కుక్క చూసి అరుస్తోంటే.. అదేం చేసిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-29T18:33:12+05:30 IST

ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కొన్నిసార్లు పిల్లి కూడా పులి అవుతుంటుంది. అడవికి రారాజు అయిన సింహం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న జంతువుల ముందు తోక ముడుస్తుంటుంది. పులులు, సింహాలు.. ఆవేశంగా వేటాడే క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

Dog vs Leopard: అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి చిరుతపులి ఎంట్రీ.. పెంపుడు కుక్క చూసి అరుస్తోంటే.. అదేం చేసిందో చూస్తే..!

ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కొన్నిసార్లు పిల్లి కూడా పులి అవుతుంటుంది. అడవికి రారాజు అయిన సింహం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న జంతువుల ముందు తోక ముడుస్తుంటుంది. పులులు, సింహాలు.. ఆవేశంగా వేటాడే క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చిరుతపులి, కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిరుతపులి అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి వస్తుంది. అక్కడే పడుకున్న పెంపుడు కుక్కకు వద్దకు వెళ్లడంతో చివరికి ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్ద ఇటీవల ఓ రోజు రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ పులి (tiger) ఓ ఇంటి వద్దకు వచ్చింది. వరండాలో పడుకుని ఉన్న పెంపుడు కుక్కను టార్గెట్ చేసింది. మెల్లగా వరండాలోకి ఎంట్రీ ఇచ్చిన పులి.. కుక్క సమీపానికి రాగానే ఒక్కసారిగా (tiger attacked the dog) దాడికి దిగింది. కుక్క వద్దకు వెళ్లి నోట కురుచుకుని వెళ్లాలని ప్రయత్నించింది. అయితే పులి రాగానే ఉలిక్కిపడ్డ కుక్క.. చివరకు తేరుకుని బిగ్గరగా మొరుగుతుంది.

Train Video: డబ్బులు పెట్టి టికెట్‌ కొని మరీ చావును ఆహ్వానించడం అంటే ఇదేనేమో.. చేయి వదిలేస్తే ప్రాణం పోయినట్టే..!

కుక్క గట్టిగా మొరగడంతో భయపడ్డ పులి కాస్త వెనక్కు తగ్గుతుంది. తర్వాత కుక్క మరింత గట్టిగా మొరుగుతూ పులిని ఎదురిస్తుంది. దీంతో పులి పూర్తిగా తోక ముడుస్తుంది. ‘‘ఈ రోజు టైం ఏమీ బాగాలేదు.. ఇక్కడి నుంచి వెళ్లడమే మంచిది’’.. అనుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి పెంపుడు కుక్క ఒక్కటి ఉంటే చాలు’’.. అని కొందరు, ‘‘కుక్క దెబ్బకు తోక ముడిచిన పులి’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమెజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-06-29T18:33:12+05:30 IST