Crime News: ఆత్మహత్య అని తేల్చేసిన పోలీసులు.. సడన్‌గా 2 నెలల తర్వాత మళ్లీ విచారణ స్టార్ట్.. అసలు ఈ యువతి కథేంటంటే..!
ABN , First Publish Date - 2023-06-29T21:50:00+05:30 IST
కొన్ని కేసులు పోలీసులకు సవాల్‌గా మారుతుంటాయి. మొదట ఆత్మహత్యగా అనుకున్న కేసుల విషయంలో చివరకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. దీంతో మళ్లీ అదే కేసుపై ఏళ్లకు ఏళ్లు విచారణ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..
కొన్ని కేసులు పోలీసులకు సవాల్‌గా మారుతుంటాయి. మొదట ఆత్మహత్యగా అనుకున్న కేసుల విషయంలో చివరకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. దీంతో మళ్లీ అదే కేసుపై ఏళ్లకు ఏళ్లు విచారణ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి మృతిపై పోలీసులు ఆత్మహత్యగా తేల్చేశారు. అయితే రెండు నెలల తర్వాత సడన్‌గా మళ్లీ విచారణ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ యువతి కథేంటంటే..
బీహార్‌కు (Bihar) చెందిన ప్రమీల (26) అనే యువతికి కొన్నేళ్ల కిందట అస్సాంకి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంలో సడన్‌గా విషాద ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్‌లో ప్రమీల ఉన్నట్టుండి రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని చిత్రకూట్ పరిధిలో ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెది ఆత్మహత్య కేసుగానే నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసును కూడా క్లోజ్ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమీల సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో ప్రమీల మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రమీల సోదరుడి ఫిర్యాదు మేరకు.. ఏడాది క్రితం బీహార్‌కు చెందిన పరమేశ్వర్ అనే వ్యక్తి ప్రమీలను (Kidnapping) కిడ్నాప్ చేశాడు. కొంత కాలం అతను ఢిల్లీలోనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రమీల జైపూర్‌లో ఉన్నట్లు తెలియగానే ఆమె నుంచి సోదరుడికి ఫోన్ వచ్చింది. త్వరలో ఇంటికి వస్తానని, ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడగడంతో సోదరుడు ఆమెకు రూ.5,000 పంపించాడు. అయితే డబ్బు పంపిన మరుసటి రోజే ప్రమీల అనుమానాస్పద స్థితిలో (woman Suspicious death) మృతి చెందింది. తమ కూతురిని పరమేశ్వరే చంపాడని ప్రమీల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాత ఫైల్‌ను మళ్లీ తెరచి విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.