Viral Video: ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే జరుగుతుంది.. అర్ధరాత్రి రోడ్డుపై ఈ యువతికి ఏమైందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-08T14:55:25+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో పల్లెల నుంచి పట్టణాల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. వయసుతో సబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ రీల్స్ పిచ్చిలో పడిపోయారు. అదీ ఎంతలా అంటే..

Viral Video: ఎక్కడ పడితే అక్కడ రీల్స్  చేస్తే ఇలాగే జరుగుతుంది.. అర్ధరాత్రి రోడ్డుపై ఈ యువతికి ఏమైందో చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో పల్లెల నుంచి పట్టణాల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. వయసుతో సబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ రీల్స్ పిచ్చిలో పడిపోయారు. అదీ ఎంతలా అంటే.. ‘‘చావనైనా చస్తాంగానీ.. రీల్స్ చేయడం మాత్రం మానుకోం’’.. అన్నంతలా మారిపోయింది. కొందరు సమయం సందర్భం లేకుండా రీల్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి అర్ధరాత్రి రోడ్డుపై రీల్స్ చేసేందుకు వచ్చింది. తీరా డాన్స్ చేస్తుండగా.. ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ప్రియా గోలానీ అనే యువతి (young woman) వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌లో (Tiktok) మంచి ఫేం సంపాదించుకుంది. రోజూలాగే రీల్స్ (Reels) చేయడానికి ఓ రోజు అర్ధరాత్రి రోడ్డు పైకి వచ్చింది. కత్రినా కైఫ్ ‘‘జరా జరా టచ్ మీ’’ పాటకు డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. ఇలా మొదలెట్టిందో లేదో అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న వీధి కుక్క యువతిని గమనించి దగ్గరికి వచ్చింది. వెంటనే ఆమె తొడపై కాటు వేసింది.

Wife-Husband: కూరగాయలు తెమ్మంటూ భర్తకు ఓ స్లిప్ ఇచ్చిందో భార్య.. ఆమె రాసింది చదివి నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో యువతి సడన్ షాక్‌కు గురైంది. దాన్నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలైనట్లు తెలిసింది. 2020లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి తింగరి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇంటిని కొన్నందుకు పంట పండిందనుకున్నారు.. చివరకు గోడలు బద్ధలు కొట్టగా బయటపడిన వస్తువులు చూసి షాక్..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-08T14:55:25+05:30 IST