Viral Video: నీటిలో ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. పెద్ద పెద్ద చేపలు పడుంటాయని పైకి ఎత్తి విప్పి చూడగా.. చివరికి షాకింగ్ దృశ్యం..

ABN , First Publish Date - 2023-09-06T21:59:47+05:30 IST

చేపల వేట సమయంలో ఒక్కొక్కరు ఒక్కో ట్రిక్ వాడుతుంటారు. కొందరు పొడవాటి కర్రకు ఎరను వేసి నీళ్లలో వేస్తే.. మరికొందరు పడవ మీద నుంచి వల వేసి చేపలు పడుతుంటారు. ఇంకొందరు వినూత్న పద్ధతులతో చిన్న చిన్న ట్రిక్‌లు వాడి కూడా చేపలు పడుతుంటారు. ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద చేపలు పడితే.. ఇక..

Viral Video: నీటిలో ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. పెద్ద పెద్ద చేపలు పడుంటాయని పైకి ఎత్తి విప్పి చూడగా.. చివరికి షాకింగ్ దృశ్యం..
ప్రతీకాత్మక చిత్రం

చేపల వేట సమయంలో ఒక్కొక్కరు ఒక్కో ట్రిక్ వాడుతుంటారు. కొందరు పొడవాటి కర్రకు ఎరను వేసి నీళ్లలో వేస్తే.. మరికొందరు పడవ మీద నుంచి వల వేసి చేపలు పడుతుంటారు. ఇంకొందరు వినూత్న పద్ధతులతో చిన్న చిన్న ట్రిక్‌లు వాడి కూడా చేపలు పడుతుంటారు. ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద చేపలు పడితే.. ఇక వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చేపల వేట సమయలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నీటిలో వల ఉన్నట్టుండి బరువెక్కడంతో పెద్ద పెద్ద చేపలు పడి ఉంటాయిని అనుకున్నారు. చివరికి వలను పైకి ఎత్తి చూసి అంతా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బారాబంకి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మత్స్యకారులు (Fishermen) రోజూ మాదిరే మంగళవారం సాయంత్రం కూడా చేపలు పట్టేందుకు (fishing) నాగర్‍‌పుల్ సమీపంలోని నమ్మ తలాబ్ వద్ద చెరువులోకి (pond) వెళ్లారు. చెరువులో వల వేసి యథావిధిగా వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం కాసేపు వేచి చూడగానే వల ఉన్నట్టుండి బరువెక్కింది. దీంతో అందులో పెద్ద పెద్ద చేపలు పడి ఉంటాయని అంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అదే ఉత్సాహంతో వలను పైకి ఎత్తారు.

Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

అయితే చివరికి దాన్ని విప్పి చూడగా.. అందులో పెద్ద మొసలి (crocodile) కనిపించింది. వలను పైకి ఎత్తగానే అందులో నుంచి బయటపడేందుకు మొసలి వేగంగా రావడం చూసి అంతా భయంతో పరుగులు తీశారు. సుమారు 10 అడుగుల మొసలిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో మొసళ్ల గతంలో ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొసళ్లు చెరువులోకి కొట్టుకువచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T21:59:49+05:30 IST