IND vs WI 2nd: ఇంకొక 2 పరుగులు చేస్తే రోహిత్-కోహ్లీ ఖాతాలో రికార్డు

ABN , First Publish Date - 2023-07-29T17:26:15+05:30 IST

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చారిత్రక రికార్డుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్ - కోహ్లీ కలిసి మరో 2 పరుగుల చేస్తే తమ వన్డే కెరీర్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. దీంతో వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడిగా రికార్డు నెలకొల్పుతారు.

IND vs WI 2nd: ఇంకొక 2 పరుగులు చేస్తే రోహిత్-కోహ్లీ ఖాతాలో రికార్డు

బార్బడోస్: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చారిత్రక రికార్డుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్ - కోహ్లీ కలిసి మరో 2 పరుగుల చేస్తే తమ వన్డే కెరీర్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. దీంతో వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడిగా రికార్డు నెలకొల్పుతారు. వెస్టిండీస్‌తో నేడు జరిగే రెండో వన్డే మ్యాచ్‌లోనే ఈ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో రోహిత్-కోహ్లీ కలిసి 4,998 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారత్ తరఫున 5 వేల పరుగులు పూర్తి చేసిన మూడో జోడిగా రోహిత్ - కోహ్లీ నిలుస్తారు. కాగా వేగంగా ఈ ఘనతను అందుకున్న జోడిగా రికార్డు నెలకొల్పుతారు. ఈ జాబితాలో సచిన్-గంగూలీ (8227), రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ (5,170)ముందున్నారు. అయితే ఓపెనింగ్‌లో కాకుండా వన్‌డౌన్‌లో ఈ రికార్డు నెలకొల్పిన తొలి భారత జోడిగా రోహిత్ - కోహ్లీ నిలవనున్నారు. కాగా మొత్తంగా ఈ జాబితాలో రోహిత్ - కోహ్లీ 8వ స్థానంలో ఉన్నారు.


ఇదే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగానూ రికార్డులు అందుకునే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ మరో 116 పరుగులు చేస్తే వెస్టిండీస్‌పై 3 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇక విరాట్ కోహ్లీ మరో 102 పరుగులు చేస్తో వన్డేల్లో 13 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో 6 వికెట్లు తీస్తే వన్డేల్లో 200 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య మరికాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది.

జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, సూర్యకుమార్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, ఉమ్రాన్‌, ముకేశ్‌.

వెస్టిండీస్:

బ్రాండన్‌ కింగ్‌, అథనజె, హోప్‌ (కెప్టెన్‌), కార్టీ, హెట్‌మయెర్‌, పావెల్‌, షెఫర్డ్‌, డ్రేక్స్‌, కారియా, మోటీ, సీల్స్‌.

Updated Date - 2023-07-29T17:26:15+05:30 IST