Ashes 4th Test: గత 11 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఇదే మొదటిసారి.. ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా..

ABN , First Publish Date - 2023-07-18T22:29:14+05:30 IST

బుధవారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా జట్టు ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి.

Ashes 4th Test: గత 11 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఇదే మొదటిసారి.. ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా..

మాంచెస్టర్: బుధవారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా జట్టు ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. ప్రధాన స్పిన్నర్ లేకపోయినప్పటికీ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రూపంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఆసీస్ తుది జట్టులో ఉన్నారు. మ్యాచ్ జరగనున్న ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్‌కే సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోనే ఆసీస్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇక గత టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2-1తో ప్రస్తుతం సిరీస్‌లో కంగారులో ముందంజలో ఉన్నారు. కాగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని జట్టు నుంచి తప్పించి వారి స్థానాల్లో జోష్ హేజిల్‌వుడ్, కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు అతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా ఇదే ఫార్మాలాను అనుసరిస్తుంది. సోమవారం ప్రకటించిన ఆ జట్టు తుది జట్టులో కూడా ఒక ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. కాకపోతే మొయిన్ అలీ రూపంలో ఇంగ్లండ్ జట్టులో మంచి స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. జో రూట్ కూడా పార్ట్ టైమ స్పిన్నర్ కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా తుది జట్టు

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్

ఇంగ్లండ్ తుది జట్టు

బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Updated Date - 2023-07-18T22:29:14+05:30 IST