Share News

ODI World Cup: 2003 నాటి సీన్ రిపీట్.. ప్రపంచ కప్ టీమిండియాదే..!!

ABN , First Publish Date - 2023-11-17T15:56:10+05:30 IST

World Cup Sentiments: 2003లో మాదిరి లెక్కలు కలిసివస్తే ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం ఖరారైనట్లేనని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2003లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగడం యాధృచ్ఛికం అని చెప్పవచ్చు. 2003లో జరిగిన మెగా టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో, భారత్ 8 మ్యాచ్‌లలో గెలిచాయి. ఈ ప్రపంచకప్‌లో సీన్ రివర్స్ అయ్యింది కాబట్టి విజేత కూడా ఇండియానే అని అందరూ భావిస్తున్నారు.

ODI World Cup: 2003 నాటి సీన్ రిపీట్.. ప్రపంచ కప్ టీమిండియాదే..!!

ఎన్నో అంచనాల నడుమ సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాను భారత్ ఢీ కొట్టనుంది. ఇప్పటివరకు ఆడింది ఒకెత్తు.. ఈ ఒక్క మ్యాచ్ మరో ఎత్తు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2003లో మాదిరి లెక్కలు కలిసివస్తే ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం ఖరారైనట్లేనని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2003లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగడం యాధృచ్ఛికం అని చెప్పవచ్చు. 2003లో జరిగిన మెగా టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో, భారత్ 8 మ్యాచ్‌లలో గెలిచాయి. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా తన మూడో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

అయితే ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు మళ్లీ ఫైనల్లో తలపడుతున్న వేళ.. 2003లో మాదిరిగా 2023లో కూడా ఫైనల్‌కు ముందు టీమిండియా 10 మ్యాచ్‌లలో, ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌లలో గెలిచాయి. ఇప్పుడు ఫైనల్లో టీమిండియా గెలిస్తే మూడో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ కానుంది. దీంతో ఇదే జరిగి తీరుతుందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. 1983లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో, 2011లో ధోనీ ఆధ్వర్యంలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ ఆధ్వర్యంలో కూడా భారత్ గెలవబోతుందని పలువురు జోస్యం చెప్తున్నారు. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచిందని.. చివరి మ్యాచ్ కూడా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-17T16:37:32+05:30 IST