Ahmedabad Test: మూడో రోజు మనదే.. సెంచరీతో గిల్, అర్ధ సెంచరీతో కోహ్లీ..
ABN , First Publish Date - 2023-03-11T17:42:37+05:30 IST
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్(Team India) పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్(Team India) పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి పర్యాటక జట్టు కంటే 191 పరుగులు వెనకబడి ఉంది. కోహ్లీ 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 36/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మరో 38 పరుగులు జోడించాక తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కునేమన్ బౌలింగులో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఆచితూడి ఆడిన గిల్ టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగో బంతికే 42 పరుగులు చేసిన పుజారా(Cheteshwar Pujara) అవుటయ్యాడు. అయితే, గిల్ మాత్రం కోహ్లీతో కలిసి పరుగులు పిండుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 235 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 128 పరుగులు చేసిన గిల్.. లయన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మరోవైపు, చాలా రోజుల తర్వాత నిలకడగా ఆడిన కోహ్లీ(Virat Kohli).. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Raivndra Jadeja) అండగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ 59, జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది.