Asia Cup 2023: ఆసియాకప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా?: భజ్జీ తేల్చేశాడు!
ABN , First Publish Date - 2023-02-27T18:30:40+05:30 IST
ఆసియా కప్(Asia Cu) 2023 ఎక్కడ జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా?
న్యూఢిల్లీ: ఆసియా కప్(Asia Cu) 2023 ఎక్కడ జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? సగటు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్(Pakistan) దక్కించుకుంది. సెప్టెంబరులో జరగాల్సి ఉంది. అయితే, ఆసియాకప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోదని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్ కూడా అయిన బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah) గతేడాది అక్టోబరులో తేల్చి చెప్పారు. అదే జరిగితే తాము కూడా ఇండియాలో జరిగే ప్రపంచకప్‌కు రాబోమని పాక్ క్రికెట్ బోర్డు(PCB) ప్రకటించింది. దీంతో ఇరు బోర్డుల మధ్య అగ్గిరాజుకుంది. ఇప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు.
ఆసియాకప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? అనే విషయంపై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించాడు. బీసీసీఐ(BCCI) నిర్ణయం సబబేనని అన్నాడు. పాకిస్థాన్‌కు మన జట్టును పంపొద్దని సూచించాడు.
ఇటీవల పాకిస్థాన్ కరాచీ స్టేడియం సమీపంలో కాల్పులు జరిగాయని గుర్తు చేశాడు. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని చోటికి జట్టును జట్టును పంపొద్దని కోరాడు. ఆటగాళ్ల భద్రతకు ప్రమాదం ఉండే ఏ చోటికైనా ఆటగాళ్లను పంపకపోవడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.