Ashes Series 4th Test: రాణించిన లబుషేన్, మార్ష్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్

ABN , First Publish Date - 2023-07-20T17:14:14+05:30 IST

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ సాధించారు.

Ashes Series 4th Test: రాణించిన లబుషేన్, మార్ష్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్

ఆస్ట్రేలియా (Australia)-ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ (Ashes Series) ఆసక్తికరంగా సాగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉండగా నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (David Warner) (32), ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) (3) విఫలమయ్యారు. అయితే మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. లబుషేన్ 115 బాల్స్‌లో 6 ఫోర్ల సహాయంతో 51 రన్స్ చేయగా.. మిచెల్ మార్ష్ 60 బాల్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 51 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ (41), ట్రావిస్ హెడ్ (48) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది.

ఇది కూడా చదవండి: Asia Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా ఆఫర్! 15 రోజుల్లోనే 3 సార్లు తలపడనున్న భారత్, పాకిస్థాన్

అయితే ఒక దశలో 182/3 స్కోరుతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ వరుసగా లబుషేన్, ట్రావిస్ హెడ్ వికెట్లను స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. కాసేపు మిచెల్ మార్ష్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మళ్లీ వెంట వెంటనే వోక్స్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (16), మార్ష్ ఔటయ్యారు. అలెక్స్ క్యారీ (20), ప్యాట్ కమిన్స్ (1) కూడా ఎంతో సేపు నిలవలేకపోయారు. మిచెల్ స్టార్క్ (36) మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. దీంతో 90.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 317 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ లేకుండా ఆస్ట్రేలియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-20T17:14:14+05:30 IST