Share News

ODI World Cup 2023: ఆశలు సమాధి చేసిన టీమిండియా.. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2023-11-19T21:25:17+05:30 IST

ODI World Cup 2023: టీమిండియా అభిమానులు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. దీంతో మూడోసారి వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా ఆరోసారి విజేతగా నిలిచి 2003 తరహాలో టీమిండియా ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.

ODI World Cup 2023: ఆశలు సమాధి చేసిన టీమిండియా.. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

వన్డే ప్రపంచకప్ ఫైనల్ టీమిండియా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 240 పరుగులు స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి ఆస్ట్రేలియా వికెట్లు తీయలేక చతికిలపడింది. 47 పరుగులకే మూడు వికెట్లు తీసినా.. ఆ తర్వాత వికెట్ తీయలేక చివరకు ఓటమి పాలైంది. దీంతో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు. 120 బాల్స్‌లో 137 రన్స్ సాధించి ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లబుషేన్ (58) హాఫ్ సెంచరీతో రాణించి హెడ్‌కు సహకారం అందించాడు. 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఓడిన టీమిండియా ఇప్పుడు కూడా ఆ జట్టు చేతిలోనే ఓడి అభిమానుల ఆశలను సమాధి చేసింది. వరుసగా 10 విజయాలు సాధించి ఆశలు రేపిన రోహిత్ సేన కీలక ఫైనల్లో ఓటమి పాలై ఆ 10 విజయాల ఘనతను బుగ్గిపాలు చేసింది.

కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి.. టీమిండియాని అంత తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేసినా నిదానంగా ఆడటం టీమిండియా కొంప ముంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, పాట్ కమిన్స్, హేజిల్ ‌వుడ్ చెరో రెండు వికెట్లు సాధించగా జంపా, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-19T21:28:02+05:30 IST