Team india: ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్‌ ఎందుకు? బీసీసీఐపై విమర్శల వర్షం

ABN , First Publish Date - 2023-09-05T17:34:56+05:30 IST

అంతర్జాతీయ కెరీర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 26 వన్డేలు ఆడి 511 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ కేవలం 24.33. అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోరు 64. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్లను సాధించాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Team india: ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్‌ ఎందుకు? బీసీసీఐపై విమర్శల వర్షం

వన్డే ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే 15 మంది సభ్యుల జట్టును మంగళవారం నాడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే జట్టులో కొందరు ఆటగాళ్లకు చోటు దక్కడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అతడి స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ లేదా లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మను తీసుకుంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. వన్డేల్లో సూర్యకుమార్ రికార్డు ఏ మాత్రం బాగోలేదని.. అతడిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

అంతర్జాతీయ కెరీర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 26 వన్డేలు ఆడి 511 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ కేవలం 24.33. అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోరు 64. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్లను సాధించాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: నన్ను అలాంటి ప్రశ్నలు అడగొద్దు.. మీడియాపై రోహిత్ శర్మ అసహనం!

అటు కొందరు కేఎల్ రాహుల్‌ను తీసుకోవడంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల తరచూ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని రాహుల్ తట్టుకోలేడని గుర్తు చేస్తున్నారు. అతడి కారణంగా టీమిండియా మూడు ప్రపంచకప్ టోర్నీలతో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైందని ప్రస్తావిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఒత్తిడిని తట్టుకోలేడని స్వయంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెప్పిన విషయాన్ని లేవనెత్తుతున్నారు. మరోవైపు చాహల్‌ను తీసుకోకపోవడంపైనా పలువురు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తున్నారు. ప్రపంచకప్ లాంటి టోర్నీకి మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టారంటూ టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2023-09-05T17:34:56+05:30 IST