Team India: ఆసియా కప్ జట్టులో 8 మంది ముంబై టీమ్ ఆటగాళ్లు..!!
ABN , First Publish Date - 2023-08-21T18:43:09+05:30 IST
ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది ఆటగాళ్లలో 8 మంది ముంబై జట్టుకు చెందినవారే ఉన్నారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అందులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ , జస్‌ప్రీత్ బుమ్రా వంటి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడారని అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కూడా గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడాడని పోస్టులు చేస్తున్నారు.
ఎన్నో రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆసియా కప్‌లో ఆడే టీమిండియాను బీసీసీఐ సోమవారం నాడు ప్రకటించింది. 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన సెలక్టర్లు 18వ ఆటగాడిగా సంజు శాంసన్‌ను స్టాండ్‌బైగా తీసుకున్నారు. అయితే ఆసియా జట్టుకు ఎంపికైన టీమ్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఎంపికలో పక్షపాతం చూపించాడని పలువురు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ టీమిండియాను చూస్తే మినీ ముంబై టీమ్‌లా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది ఆటగాళ్లలో 8 మంది ముంబై జట్టుకు చెందినవారే ఉన్నారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అందులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ , జస్‌ప్రీత్ బుమ్రా వంటి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడారని అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కూడా గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడాడని పోస్టులు చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. వన్డేల్లో గొప్ప రికార్డు లేని సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడం అర్ధం కాకుండా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కంటే సంజూ శాంసన్ వన్డే రికార్డులు మెరుగ్గా ఉన్నాయని.. అలాంటి సంజు శాంసన్‌ను 17 మందిలో ఎంపిక చేయకుండా స్టాండ్ బైగా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముంబైకి చెందిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ తమ రాష్ట్రానికే చెందిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు కల్పించారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Team India: తిలక్ వర్మకు ఏమైంది? ఇలా ఆడితే తుది జట్టులో చోటు కష్టమేగా..!!
కొంతకాలంగా కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌లో ఉన్నాడని.. అందులోనూ అతడికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ అతడికి ఆసియా కప్ లాంటి టోర్నీలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ స్థానాలలో వన్డేల్లో మంచి సగటు ఉన్న సంజు శాంసన్ లాంటి ఆటగాడిని బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. అటు వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న చాహల్ వంటి స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకోవడం టీమ్ కాంబినేషన్‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ఆసియా కప్‌కు ఎంపికైన 18 మంది శ్రీలంక వెళ్లడానికి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గొననుంది.