ODI World Cup 2023: కప్పు కచ్చితంగా టీమిండియాదే..!! 2011 నాటి కథ రిపీట్..!!
ABN , First Publish Date - 2023-11-14T13:08:38+05:30 IST
2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఏం జరిగిందో.. ఈ ప్రపంచకప్‌లో కూడా అదే జరుగుతోందని.. దీంతో కచ్చితంగా టీమిండియా కప్పు కొడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరో రెండు మ్యాచ్‌ల వరకు ఇదే జోరు కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2011లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన తర్వాత 2015, 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లలో సెమీస్ వరకు వెళ్లినా మనకు నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గతంలో నాకౌట్లలో న్యూజిలాండ్‌దే పైచేయి అయినా ఈసారి టీమిండియా చరిత్ర తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఏం జరిగిందో.. ఈ ప్రపంచకప్‌లో కూడా అదే జరుగుతోందని.. దీంతో కచ్చితంగా టీమిండియా కప్పు కొడుతుందని చర్చించుకుంటున్నారు. సుమారుగా 10 పాయింట్లను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
1) 2011లో పాకిస్థాన్‌పై ఆడిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. అందరూ తలో రెండు వికెట్ల చొప్పున సాధించారు. ఈ ప్రపంచకప్‌లో కూడా పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ తలో రెండు వికెట్లు సాధించారు. ః
2) ఒషినియా దేశాలలో ఒక దేశం నుంచి 2011 ప్రపంచకప్‌లో పుట్టినరోజు నాడు సెంచరీ సాధించగా.. ఈ ప్రపంచకప్‌లో కూడా ఒషినియా దేశాలలో ఒక దేశ ఆటగాడు పుట్టినరోజు నాడు సెంచరీ సాధించాడు. 2011లో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ ఈ ఫీట్ అందుకోగా.. 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఈ ఫీట్ రిపీట్ చేశాడు.
3) 2011లో నంబర్ 5లో బ్యాటింగ్ చేసే టీమిండియా ఆటగాడు (ధోనీ-శ్రీలంకపై 91 నాటౌట్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా 2023లోనూ నంబర్ 5 టీమిండియా బ్యాటర్ (కేఎల్ రాహుల్-ఆస్ట్రేలియాపై 97 నాటౌట్) మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు.
4) 2011లో ప్రపంచకప్ చరిత్రలోనే ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్ అత్యంత వేగవంతమైన సెంచరీ చేయగా.. 2023లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్, ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించారు.
5) ప్రపంచకప్ చరిత్రలో ఛేదనలో భారీ స్కోరును 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ అందుకుంది. ఇంగ్లండ్‌పై రికార్డు స్థాయిలో 328 పరుగులను ఛేదించింది. ఈ ప్రపంచకప్‌లో ఈ ఫీట్‌ను పాకిస్థాన్ అందుకుంది. శ్రీలంకపై 345 పరుగులను విజయవంతంగా ఛేదించింది.
6) 2010లో టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ గెలవగా 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచింది. ఇప్పుడు 2022లో టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ గెలిచిందని.. దీంతో 2023 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.
7) 2011 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ (యువరాజ్-ఐర్లాండ్‌పై) 5 వికెట్లు సాధించగా 2023లోనూ టీమిండియా స్పిన్నర్ (జడేజా-దక్షిణాఫ్రికాపై) ఓ మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.
8) 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించగా.. ఈ ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌పైనే కోహ్లీ సెంచరీ సాధించడం విశేషం.
9) 2011లో నంబర్ 4లో బ్యాటింగ్ చేసే టీమిండియా ఆటగాడు (యువరాజ్-వెస్టిండీస్‌పై) సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా 2023లోనూ నంబర్ 4 టీమిండియా బ్యాటర్ (శ్రేయాస్ అయ్యర్-నెదర్లాండ్స్‌పై) సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.