Share News

ICC: టీమిండియాకు భారీ షాక్.. జరిమానాతో పాటు పాయింట్లలో కోత పెట్టిన ఐసీసీ

ABN , Publish Date - Dec 29 , 2023 | 02:35 PM

ICC: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందాన అసలే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమితో సతమతం అవుతుందన్న టీమిండియాపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ సేన‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. అంతేకాకుండా ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో కీల‌క‌మైన రెండు పాయింట్లను కూడా ఐసీసీ కట్ చేసింది.

ICC: టీమిండియాకు భారీ షాక్.. జరిమానాతో పాటు పాయింట్లలో కోత పెట్టిన ఐసీసీ

సెంచూరియన్ వేదికగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ ఓటమితో అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందాన అసలే ఓటమితో సతమతం అవుతుందన్న టీమిండియాపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ సేన‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. అంతేకాకుండా ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో కీల‌క‌మైన రెండు పాయింట్లను కూడా ఐసీసీ కట్ చేసింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండు ఓవ‌ర్లు త‌క్కువ‌గా బౌల్ చేసింది. దీంతో స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఏ జట్టు అయినా నిర్ణీత స‌మ‌యంలోగా ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌కుంటే ఆర్టిక‌ల్ 2.22 ఐసీసీ ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి కింద ఆట‌గాళ్లకు 5 శాతం ఫీజు కోత విధిస్తారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓటమి చెందడంతో 16 పాయింట్లతో టీమిండియా ఐదో స్థానంలో నిలిచింది. పాయింట్ల శాతం 44.44గా ఉంది. అయితే ఐసీసీ మరో రెండు పాయింట్ల కోత విధించడంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా (38.89) ఆరో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాపై ఓడిన పాకిస్థాన్ 45.83 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 29 , 2023 | 02:38 PM