Share News

IND vs SA: కీలకమైన మూడో వన్డేకు పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

ABN , Publish Date - Dec 21 , 2023 | 07:33 AM

India vs South africa: సౌతాఫ్రికా పర్యటనలో కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ముగిసిన రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది.

IND vs SA: కీలకమైన మూడో వన్డేకు పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..?

పార్ల్: సౌతాఫ్రికా పర్యటనలో కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ముగిసిన రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుండడంతో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మొదటి వన్డే మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు దానికి భిన్నంగా రెండో వన్డేలో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమైంది. మొదటి వన్డేలో సౌతాఫ్రికాను 116 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 211 పరుగులకే ఆలౌటైంది. మొదటి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లు రెండో వన్డేలో తేలిపోయారు. దీంతో కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లో గెలవాలంటే భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంది.


ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే బొలాండ్ పార్క్ పిచ్ రిపోర్టును ఒకసారి పరిశీలిస్తే.. ఇక్కడ బౌలర్లకు కొంత హెల్ప్ ఉంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌కు కూడా మంచి సహకారమే ఉంటుంది. క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయడం పెదగా కష్టం కాకపోవచ్చు. 250 పరుగులకు పైగా స్కోర్లు రావొచ్చు. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం వాతావరణం వేడిగా ఉండనుంది. వర్షం పడే అవకాశాలు లేవు. గత రికార్డులను బట్టి చూస్తే మ్యాచ్‌లో టాస్ ప్రభావం పెదగా ఉండకపోవచ్చు. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 20 వన్డే మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 9 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 234 పరుగులుగా ఉండగా.. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 182 పరుగులుగా ఉండనుంది. ఇక్కడ నమోదైన అత్యధిక స్కోర్ 353/6. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా సాధించింది. అత్యల్ప స్కోర్ 36 ఆలౌట్. సౌతాఫ్రికా చేతిలో కెనడా 36 పరుగులకే ఆలౌటైంది. ఈ వేదికపై అత్యధిక లక్ష్య చేధన 288/3. టీమిండియాపై సౌతాఫ్రికా సాధించింది. కాపాడుకున్న అత్యల్ప లక్ష్యం 204. నెదర్లాండ్స్‌పై టీమిండియా కాపాడుకుంది.

Updated Date - Dec 21 , 2023 | 07:36 AM