Share News

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా గత వన్డే రికార్డులపై ఓ లుక్కేయండి..

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:01 AM

India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నేడు జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి.

IND vs SA: భారత్ vs సౌతాఫ్రికా గత వన్డే రికార్డులపై ఓ లుక్కేయండి..

సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నేడు జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, సౌతాఫ్రికా గత వన్డే రికార్డులను ఒకసారి పరిశీలిస్తే సౌతాఫ్రికాదే అధిపత్యం కనిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 91 సార్లు తలపడ్డాయి. అత్యధికంగా సౌతాఫ్రికా 50 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్ 38 మ్యాచ్‌ల్లో గెలిచింది.3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై పూర్తి అధిపత్యం కనబర్చిన భారత జట్టు ఘనవిజయం సాధించింది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 3 వన్డేల్లో కూడా టీమిండియానే గెలిచింది.


రెండు జట్ల వన్డే పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ 2001 పరుగులు చేశాడు. సచిన్ కొట్టిన వన్డే డబుల్ సెంచరీ సౌతాఫ్రికా పైనే కావడం గమనార్హం. అత్యధిక వికెట్లు సౌతాఫ్రికా బౌలర్ షాన్ పొల్లాక్ తీశాడు. పొల్లాక్ 48 వికెట్లు తీశాడు. రెండు జట్ల పోటీలో టీమిండియా అత్యధిక స్కోర్ 401/3గా ఉంది. అత్యల్ప స్కోర్ 91గా ఉంది. సౌతాఫ్రికా అత్యధిక స్కోర్ 438/4గా ఉంది. అత్యల్ప స్కోర్ 83 పరుగులుగా ఉంది. రెండు జట్ల పోటీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసింది సచిన్ టెండూల్కర్. సచిన్ 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అత్యత్తమ బౌలింగ్ పరంగా టీమిండియా బౌలర్ సునీల్ జోషి ముందున్నాడు. జోషి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

Updated Date - Dec 17 , 2023 | 09:01 AM