India vs Sri Lanka: భారత్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన శ్రీలంక

ABN , First Publish Date - 2023-01-03T18:55:22+05:30 IST

భారత్‌(Team India)తో మరికాసేపట్లో ఇక్కడి వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో జరగనున్న తొలి

India vs Sri Lanka: భారత్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన శ్రీలంక
Team India

ముంబై: భారత్‌(Team India)తో మరికాసేపట్లో ఇక్కడి వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో జరగనున్న తొలి టీ20లో శ్రీలంక (Sri Lanka) టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. కొత్త ఏడాదిలో భారత్‌కు ఇదే మొదటి సిరీస్. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), కేఎల్ రాహుల్(KL Rahul) వంటి వారు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. రోహిత్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌తో శుభమన్ గిల్(Shubman Gill), శివమ్ మావీ(Shivam Mavi) టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు.

భారత జట్టు: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివం మావీ, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దాసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీశ్ తీక్షణ, కశున్ రజిత, దిల్షాన్ మధుశంక

Updated Date - 2023-01-03T18:55:36+05:30 IST