Share News

IPL 2024: కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను ప్రకటించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:14 PM

IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జరిగిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో చేరనుండటంతో అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

IPL 2024: కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను ప్రకటించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జరిగిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో చేరనుండటంతో అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది. నితీష్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం కావడం దురదృష్టకరమని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ అన్నారు. గాయం నుంచి కోలుకునేందుకు అయ్యర్ కష్టపడిన విధానం.. ఆ తర్వాత అతడు ఫామ్‌లోకి వచ్చిన తీరు నిజంగా ప్రశంసనీయమని తెలిపారు. కెప్టెన్‌గా అతడు మళ్లీ బాధ్యతలు చేపట్టి తమ జట్టును విజయపథంలో నడుపుతాడని విశ్వసిస్తున్నామని కేకేఆర్ సీఈవో అభిప్రాయపడ్డారు.

కాగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో నితీష్ రానాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అయితే అతడి నాయకత్వంలో కేకేఆర్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంలో విఫలం చెందింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జరిగిన ఆసియా కప్‌కు శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌లో రాణించాడు. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడికే తిరిగి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

kkr announcement.jpg


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 14 , 2023 | 05:14 PM