Team India: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభ వేడుక.. స్టార్ క్రికెటర్లకు ఆహ్వానం
ABN , First Publish Date - 2023-12-06T14:55:24+05:30 IST
Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 6వేల మందికి శ్రీరామ జన్మభూమి తీర్ధ్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్‌కు చెందిన ప్రముఖులు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందినట్లు సమాచారం అందుతోంది.
కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. జనవరి 22న అయోధ్యలోని రామాలయం ప్రారంభం కానుండగా జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టాప్-2లో నిలవాలంటే సొంతగడ్డపై జరిగే ఈ టెస్ట్ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. తొలి టెస్టు హైదరాబాద్‌లో, రెండో టెస్టు విశాఖపట్నంలో, మూడో టెస్టు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు రాంచీలో, ఐదో టెస్టు ధర్మశాలలో జరుగుతాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ పూర్తి కాగానే ఐపీఎల్-17 ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.