Team India: ట్రోఫీ తీసుకోని కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలు కారణం ఇదే..!!

ABN , First Publish Date - 2023-09-28T21:20:36+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఓడినా సిరీస్ భారత్‌దే కావడంతో ట్రోఫీ అందుకోవడానికి రోహిత్ శర్మ ఆహ్వానించగా అతను నిరాకరించాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కేఎల్ రాహుల్‌కు ట్రోఫీ అందజేయాలని నిర్వాహకులకు రోహిత్ సూచించాడు.

Team India: ట్రోఫీ తీసుకోని కెప్టెన్ రోహిత్ శర్మ.. అసలు కారణం ఇదే..!!

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మూడో వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం వహించాడు. మూడో వన్డేలో మాత్రం టీమిండియా ఓటమి పాలైంది. చివరి మ్యాచ్ ఓడినా సిరీస్ భారత్‌దే కావడంతో ట్రోఫీ అందుకోవడానికి రోహిత్ శర్మ ఆహ్వానించగా అతను నిరాకరించాడు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కేఎల్ రాహుల్‌కు ట్రోఫీ అందజేయాలని నిర్వాహకులకు రోహిత్ సూచించాడు. దీంతో వారు కేఎల్ రాహుల్‌ను ఆహ్వానించి ట్రోఫీ అందజేశారు. అయితే ట్రోఫీ ముట్టుకోవడానికి కూడా రోహిత్ ఇష్టపడలేదు.

అనంతరం వన్డే సిరీస్ ట్రోఫీని కేఎల్ రాహుల్ సౌరాష్ట్రకు చెందిన లోకల్ ప్లేయర్లకు అందజేశాడు. సాధారణంగా జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ట్రోఫీని అందజేస్తుంటారు. అయితే రాజ్‌కోట్ వన్డేలో భారత్ జట్టుకు 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉండటంతో టీమ్‌ మేనేజ్‌మెంట్ లోకల్ ప్లేయర్ల సాయం కోరింది. వారిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా బ్యాకప్‌గా ఉపయోగించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే సౌరాష్ట్ర లోకల్ ప్లేయర్లు చివరి వన్డేలో భాగమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా గెలిచిన ట్రోఫీని లోకల్ ప్లేయర్లకు అందజేశారు.

ఇది కూడా చదవండి: Team India: వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు.. సీనియర్ ఆటగాడికి చోటు

కాగా రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకోకపోవడంతో టీమిండియా అభిమానులు అభినందిస్తున్నారు. తన సారథ్యంలో గెలవని సిరీస్ ట్రోఫీని తీసుకోకుండా రోహిత్ తమ మనసును గెలిచాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మామ ఈ కప్ నీదిరా అంటూ కేఎల్ రాహుల్‌కు రోహిత్ ట్రోఫీ అందజేశాడని అభిప్రాయపడుతున్నారు. అటు చివరి వన్డేలో రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చినా టీమిండియా చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. ఓపెనర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను పంపడం మైనస్‌ అయ్యింది. అతడు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 66 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.

Updated Date - 2023-09-28T21:25:00+05:30 IST