Share News

India Vs NewZealand: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌పై మనసులో మాట చెప్పిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్..

ABN , First Publish Date - 2023-11-13T13:58:49+05:30 IST

నవంబర్ 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనుండగా... నవంబర్ 16న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

India Vs NewZealand: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌పై మనసులో మాట చెప్పిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్..

బెంగళూరు: భారత్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ కప్ 2023లో లీగ్ దశ పూర్తయ్యింది. ఇక నాకౌట్ సమరం మాత్రమే మిగిలివుంది. నవంబర్ 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనుండగా... నవంబర్ 16న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం న్యూజిలాండ్‌పై ఆడబోయే సెమీఫైనల్ తమకు అధిక ఒత్తిడితో కూడిన మ్యాచ్‌గా అవుతుందని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. లీగ్ దశలో తొమ్మిదికి 9 మ్యాచ్‌లు గెలిచినా సెమీస్‌లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడి ఉండదని తాను చెప్పితే అబద్ధమే అవుతుందని, క్రికెట్‌లో ఫలానా మ్యాచ్ గెలుస్తామన్న గ్యారంటీ ఉందని వ్యాఖ్యానించాడు. అత్యుత్తమంగా సన్నద్ధమయ్యే మ్యాచ్ ఆడడమే ఆటగాళ్ల చేతుల్లో ఉంటుందని పేర్కొన్నాడు. లీగ్ దశలో గెలిచిన 9 మ్యాచ్‌ల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని ద్రావిడ్ వెల్లడించాడు.


నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో ఈ మేరకు రాహుల్ ద్రావిడ్ మాట్లాడాడు. మ్యాచ్‌లు గెలుస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుందని, ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏమీ తెలియదంటూ విమర్శలు వచ్చి పడుతుంటాయని అన్నాడు. లీగ్ మ్యాచ్‌ల్లో కోచ్‌గా తమ పాత్ర ఏంటని ప్రశ్నించగా ద్రావిడ్ ఈ విధమైన సమాధానం ఇచ్చాడు. ఇదిలావుండగా నాలుగవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శన పట్ల కోచ్ ద్రావిడ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిలార్డర్‌కు వెన్నెముకగా మారాడని, గత 10 ఏళ్లులుగా టీమిండియాలో 4వ స్థానం ఎంత ఇబ్బందికరంగా మారిందో అందరికీ తెలిసిందేనని చెప్పాడు.

Updated Date - 2023-11-13T13:59:22+05:30 IST