ODI 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో మనోళ్లే తోపు
ABN , Publish Date - Dec 22 , 2023 | 06:07 PM
ODI 2023: ఐసీసీ ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది.
ఐసీసీ ర్యాంకుల్లో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా అయితే వన్డేల చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధికంగా 30 విజయాలు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కూడా ఆస్ట్రేలియానే ఉంది. 1993లో వన్డేల్లో 26 విజయాలను ఆస్ట్రేలియా తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు, ఐదో స్థానాల్లో దక్షిణాఫ్రికా ఉంది. 1996, 2000లో దక్షిణాఫ్రికా వన్డేల్లో 25 విజయాలు కైవసం చేసుకుంది.
కాగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. కానీ కీలకమైన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతకుముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించి వన్డే సిరీస్ సాధించడం విశేషం. గత పర్యటనలో దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ అయిన భారత్ ఈ పర్యటనలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో సిరీస్ విజయం తమ ఖాతాలో వేసుకోవడం గొప్ప విషయమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.