IND Vs AUS: రాణించిన ఓపెనర్లు.. కంగారూలపై తొలి పంచ్ మనదే
ABN , First Publish Date - 2023-09-22T22:00:34+05:30 IST
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో 48.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. రుతురాజ్ గైక్వాడ్ 77 బాల్స్‌లో 10 ఫోర్లు సహాయంతో 71 రన్స్ చేశాడు. అటు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 63 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (3) నిరాశపరిచినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో టీమిండియా సులభంగా ఈ మ్యాచ్‌లో గెలుపు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో రాణించడంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (52), జోష్ ఇంగ్లీస్ (45), స్మిత్ (41), లబుషేన్ (39) మాత్రమే ఫర్వాలేదనిపించారు.