ICC ODI Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు
ABN , First Publish Date - 2023-10-18T15:18:09+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో రాణిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ సత్తా చాటారు. టాప్-10 జాబితాలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. టాప్-10 జాబితాలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (818 పాయింట్లు) రెండో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ (719 పాయింట్లు) 6వ స్థానంలో, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (711 పాయింట్లు) 8వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ప్రపంచకప్‌లో అంతగా ఫామ్‌లో లేని పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (836 పాయింట్లు) వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇది కూడా చదవండి: Team India: రోహిత్ శర్మ హ్యాట్రిక్ సాధిస్తాడా? క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ..!!
కాగా ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ మాత్రం మూడో స్థానానికి చేరాడు. అతడి ఖాతాలో 742 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. నాలుగో స్థానం కూడా దక్షిణాఫ్రికా ఆటగాడే సొంతం చేసుకున్నాడు. వాండర్ డుస్సెన్ 732 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఐదో స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ 729 పాయింట్లతో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 712 పాయింట్లతో ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ ఖాతాలోనూ 711 పాయింట్లు ఉండటంతో అతడు సంయుక్తంగా విరాట్ కోహ్లీతో కలిసి 8వ స్థానంలో ఉన్నాడు. ఇక పదో స్థానంలో పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ 705 పాయింట్లతో కొనసాగుతున్నాడు. అటు టీమ్ ర్యాంకుల్లో టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. 110 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో, 109 పాయింట్లతో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, 106 పాయింట్లతో ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.