Virat Kohli: సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-01-15T18:20:28+05:30 IST

శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న తుది వన్డేలో టీమిండియా(Team India) మాజీ సారథి

Virat Kohli: సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

తిరువనంతపురం: శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న తుది వన్డేలో టీమిండియా(Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) విశ్వరూపం ప్రదర్శించాడు. మైదానంలో పరుగుల వాన కురిపించిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక వేగం పెంచిన ఈ రన్ మెషీన్.. ఆపై సెంచరీ బాదేసి వన్డేల్లో 46 సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ. గువాహటిలో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు.

ఈ సెంచరీతో కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. సొంతగడ్డపై కోహ్లీకి ఇది 21వ వన్డే సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ (Sachin Tendulkar) ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడా రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. అంతేకాదు, మరో మూడు సెంచరీలు సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ సరసన చేరుతాడు.

Updated Date - 2023-01-15T18:20:30+05:30 IST