WPL: ముంబై ముందు ఓ మాదిరి లక్ష్యం.. రెండో గెలుపు ఖాయమేనా?

ABN , First Publish Date - 2023-03-06T21:38:14+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో ఇక్కడి

WPL: ముంబై ముందు ఓ మాదిరి లక్ష్యం.. రెండో గెలుపు ఖాయమేనా?

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో ఇక్కడి బ్రాబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్లలోనే 155 పరుగులకు ఆలౌటై ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న మంధాన(Smriti Mandhana) సేన తొలుత తడబడింది.

39 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 43 పరుగుల వద్ద వరుసగా మరో రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు, ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచడంతో పరుగులు రావడం కష్టమైంది. ఒక్కో పరుగు కోసం ఆర్సీబీ చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ క్రమంలో చివరి వరుస బ్యాటర్లు నిలదొక్కుకోవడంతో వికెట్ల పతనానికి కాసేపు అడ్డుకట్ట పడినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. ఫలితంగా మరో 8 బంతులు మిగిలి ఉండగానే 155 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది.

వికెట్ కీపర్ రిచా ఘోష్ 26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 పరుగులు చేసి టాపర్‌గా నిలవగా కనిక అహుజా 22, శ్రేయాంక పాటిల్ 23, మేఘన్ షట్ 20 పరుగులు చేశారు. కెప్టెన్ స్మృతి మంధాన 23, సోఫీ డివైన్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీసుకోగా, సైకా ఇషాక్, అమీలియా కెర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-03-06T21:38:14+05:30 IST