IND vs PAK: మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?
ABN , First Publish Date - 2023-09-10T17:18:34+05:30 IST
అనుకున్నదే జరిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు.
కొలంబో: అనుకున్నదే జరిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో భారీ వర్షం పడుతోంది. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు సోమవారం రిజర్వ్ డే కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 13.2 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడాడు. మరోవైపు గిల్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు.
ఈ క్రమంలో గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది 8వ హాఫ్ సెంచరీ కాగా.. రోహిత్ శర్మకు 50వ హాఫ్ సెంచరీ. అయితే వీరిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫహీమ్ అష్రఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 121 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేశాడు. ఆ కాసేపటికే షామీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. 52 బంతులు ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో 123 పరుగులకు టీమిండియా ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్