IND vs SL: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పు!

ABN , First Publish Date - 2023-09-12T14:41:46+05:30 IST

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs SL: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పు!

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టేల్స్ చెప్పాడు. కానీ కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌కు తమ తుది జట్టులో ఒక మార్పు చేసినట్టు తెలిపాడు. పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు పేర్కొన్నాడు. దీంతో శార్దూల్ ఠాకూర్‌ను తప్పించి అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్న రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో ఉంది. అతిథ్య జట్టు శ్రీలంక కూడా ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా లంక బరిలోకి దిగుతోంది. హోంగ్రౌండ్‌లో ఆడుతుండడం శ్రీలంకకు సానుకూలంగా మారే అవకాశం ఉంది.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరన

Updated Date - 2023-09-12T15:04:40+05:30 IST