IND vs WI: టాస్ గెలిచిన భారత్.. యువ బౌలర్ అరంగేట్రం.. కీపర్‌గా ఎవరంటే..?
ABN , First Publish Date - 2023-07-27T18:52:28+05:30 IST
వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
బార్బడోస్: వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కే జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోగా.. చాహల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక ప్రధాన స్పిన్నర్, ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగుతుంది.
వెస్టిండీస్ తుది జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్